Shruti Hassan: కొత్త బాయ్ ఫ్రెండ్ వేటలో శృతి.. సంచలన వీడియో వైరల్..!

Shruti Hassan.. లోక నాయకుడు కమలహాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శృతిహాసన్ తన తండ్రి ఇమేజ్ ను ఉపయోగించుకోకుండా సొంత టాలెంట్ తో తనను తాను నిరూపించుకుంది.. తెలుగులో గబ్బర్ సింగ్ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చి ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతోంది.. పాన్ ఇండియా హీరోయిన్ గా చలామణి అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఈ ముద్దుగుమ్మ.. ఇదిలా ఉండగా సినిమాల పరంగా ఎంత సక్సెస్ అయితే అయిందో వ్యక్తిగతంగా కూడా అంత ఫెయిల్యూర్స్ ని చూస్తోంది శృతిహాసన్..

బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్..

Shruti Hassan: Shruti on the hunt for a new boyfriend.. Sensational video viral..!
Shruti Hassan: Shruti on the hunt for a new boyfriend.. Sensational video viral..!

ఇక అసలు విషయంలోకెళితే ప్రముఖ డూడుల్ ఆర్టిస్టు శాంతన్ హజారిక తో ఆమె విడిపోతున్నట్లు అధికారికంగా వెల్లడించిన విషయం తెలిసిందే.. ఇటీవల ఈమె ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ విషయాన్ని కూడా దృవీకరించింది. ఇకపోతే ఈమె ఇటీవల బ్రేకప్ అయిందని పెద్ద ఎత్తున కొంతకాలంగా ప్రచారం జరుగుతూ ఉండగా సోషల్ మీడియా వేదికగా వీరిద్దరూ విడాకులు తీసుకున్నామని ప్రకటించారు.. కరోనా లాక్ డౌన్ కాలం నుండి శృతి, శంతను ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తూ ముంబైలో సహజీవనం కూడా చేశారు.. తరచుగా శృతి తమ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చింది.. దీంతో పెళ్లి చేసుకుంటారనుకుంటే ఇప్పుడు బ్రేకప్ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.

కొత్త బాయ్ ఫ్రెండ్ వేటలో శృతిహాసన్..

ఇకపోతే ఈ విషయాన్ని అభిమానులతో కమ్యూనికేట్ చేయడానికి గురువారం ఆస్క్ మీ ఎనీథింగ్ అనే సెషన్ నిర్వహించింది శృతిహాసన్. ఈ చిట్ చాట్ సెషన్ లో భాగంగా ఎన్నో ప్రశ్నలకు ధైర్యంగా సమాధానం ఇచ్చింది.. ఇందులో భాగంగానే ఒక అభిమాని తన రిలేషన్ గురించి ప్రశ్నించగా.. ఆమె సమాధానం చెబుతూ నాకు ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ఇష్టం లేదు.. కానీ నేను పూర్తిగా ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను.. మింగిల్ అవ్వాలని చూస్తున్నాను.. ప్రస్తుతం నేను వరుస సినిమాలలో బిజీగా ఉంటూ నా జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను.. త్వరలోనే మింగిల్ అవ్వడానికి సిద్ధమవుతాను అంటూ కామెంట్ చేసింది.. ఇక ఈ విషయం తెలిసి నెటిజన్స్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పటికే ఇద్దరితో బ్రేకప్ చేసుకున్నావు… ఇప్పుడు మరొకరు కావాలా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

మైఖేల్ కోర్సలేతో కూడా డేటింగ్..

గతంలో కూడా మైఖేల్ కోర్సలే తో ఈమె డేటింగ్ లో ఉంది.. కానీ అతడితో బ్రేకప్ చెప్పేసి శాంతన్ హజారికతో డేట్ చేసింది.. ఇప్పుడు అతనికి కూడా బ్రేకప్ చెప్పిన ఈ ముద్దుగుమ్మ త్వరలోనే ఇంకొకరితో మింగిల్ అవ్వడానికి సిద్ధమంటూ కామెంట్లు చేసింది. మొత్తానికైతే శృతిహాసన్ ఇప్పుడు మళ్లీ కొత్త బాయ్ ఫ్రెండ్ వేటలో పడిందని నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు

శృతిహాసన్ సినిమాలు..

చివరిగా గత ఏడాది ప్రభాస్ తో సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ సినిమాలో కనిపించిన ఈమె.. పార్ట్ 2 లో కూడా కనిపించనుంది.. దీంతోపాటు చెన్నై స్టోరీలో కూడా నటిస్తోంది.. అంతేకాకుండా అడివి శేష్ తో కలిసి డెకాయిట్ అనే చిత్రంలో కూడా కీలకపాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు