Shruti Hassan: రామ్ చరణ్ కు అండగా.. నెటిజన్ కి దిమ్మతిరిగే కౌంటర్..!

Shruti Hassan.. ప్రముఖ హీరోయిన్ శృతిహాసన్.. ఎప్పుడూ కూడా అందరూ నచ్చే దారిలో కాకుండా తనకు నచ్చినట్లు బ్రతికేస్తూ ఉంటుంది.నటిగానే కాకుండా సింగర్ గా కూడా సత్తా చూపిస్తూ ఉండే ఈమె అప్పుడప్పుడు అభిమానులతో చిట్ చాట్ చేస్తూ వారికి దగ్గరగా ఉంటుంది.. అలా తాజాగా మరొకసారి అభిమానులతో చిట్ చాట్ సెషన్ నిర్వహించింది. ఈ క్రమంలోనే తనకు ఎదురైన ఒక ప్రశ్నపై అసహనం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేయడం ఇప్పుడు వైరల్ గా మారుతోంది.. సెషన్ లో భాగంగా ఒక అభిమాని సౌత్ ఇండియన్ యాసలో ఏదైనా చెప్పవా అంటూ అడగగా.. అందుకు శృతి ఇలా రియాక్ట్ అయింది.. ఈ రకమైన జాతి వివక్షను నేను ప్రోత్సహించను. మమ్మల్ని చూసి ఇడ్లీ, దోశ, సాంబార్ అంటూ ఇలాంటి పేర్లతో పిలిస్తే మేము అసలు ఊరుకోము. మీరు మమ్మల్ని అనుకరించలేరు కాబట్టి మాలాగా ఉండాలని ట్రై చేయకండి. ఎలా పడితే అలా పిలిస్తే దాన్ని కామెడీగా తీసుకోము ..సౌత్ ఇండియన్ భాషలో ఏదైనా చెప్పమని అడిగావు కదా నోరు మూసుకొని వెళ్ళు అంటూ తమిళంలో రాసుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికైతే అతడు అడిగిన ప్రశ్నకు భారీగానే కౌంటర్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ..

రామ్ చరణ్ కు అండగా శృతిహాసన్..

Shruti Hassan: Shruti Support to Ram Charan.!
Shruti Hassan: Shruti Support to Ram Charan.!

అయితే శృతిహాసన్ ఇలాంటి సమాధానం చెప్పడానికి కూడా కారణం లేకపోలేదు.. మొన్నా మధ్య జామ్ నగర్ లో జరిగిన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో బాలీవుడ్ బడా హీరో షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ ను అందరి ముందు ఇడ్లీ, వడ అని పిలిచాడు.. అలా పిలవడాన్ని చరణ్ మేకప్ పార్టిస్ట్ జెబా హాసన్ తీవ్రంగా తప్పు పట్టింది.. గ్లోబల్ స్టార్ ను పట్టుకొని స్నాక్స్ పేరుతో పిలుస్తారా అని మండిపడింది.. ఈ నేపథ్యంలోనే శృతిహాసన్ ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని సౌత్ హీరోని ఇంత ఘోరంగా అవమానించిన నేపథ్యంలో నెటిజన్ కి ఇలాంటి కౌంటర్ ఇచ్చింది శృతిహాసన్.

శృతిహాసన్ సినిమాలు..

ఇక శృతిహాసన్ సినిమాల విషయానికి వస్తే ..గత ఏడాది ప్రభాస్ సరసన సలార్ సినిమాతో సందడి చేసి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.. ఇప్పుడు అడివి శేషు నటించిన డెకాయిట్ సినిమాలో నటిస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

- Advertisement -

శృతిహాసన్ కెరియర్..

ధనుష్ నటించిన త్రీ సినిమాతో వెలుగులోకి వచ్చిన ఈమె.. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.. అయితే నిజానికి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఐరన్ లెగ్ గానే ముద్ర వేసుకున్న శృతిహాసన్.. దాంతో తనదైన నటన కనబరుస్తూ కథల ఎంపిక విషయంలో జాగ్రత్త పడుతూ.. పేరు సొంతం చేసుకుంది.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో ఫామ్ లోకి వచ్చింది శృతిహాసన్. ఇక తండ్రి కమల్ హాసన్ ఇమేజ్ ను ఎక్కడ ఉపయోగించకుండా.. సొంత టాలెంట్ తో ప్రత్యేకమైన క్రేజ్ దక్కించుకుంది. ఇక ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది శృతిహాసన్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు