Shruti Hassan : టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్లలో కమలహాసన్ వారసురాలు శృతిహాసన్ కూడా ఒకరు.. ఈ ముద్దుగుమ్మ మొదట్లో నటించిన సినిమాలన్నీ డిజాస్టర్ కావడంతో ఐరన్ లెగ్ అంటూ ముద్ర వేయించుకుంది.. కొంతకాలం డిజాస్టర్లు చవిచూసిన ఈమె గబ్బర్ సింగ్ సినిమా తర్వాత వెను తిరిగి చూసుకోలేదు. వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. ఇప్పటికీ ఎన్నో మంచి మంచి చిత్రాలలో నటిస్తూ పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు సంపాదించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే శృతిహాసన్ సినిమాలలో కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలలోనే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటుంది.
అభిమానులతో చిట్ చాట్ నిర్వహించిన శృతిహాసన్..
సినీ ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఎప్పుడూ కూడా తన తండ్రి కమలహాసన్ పేరుని ఉపయోగించుకోలేదు శృతిహాసన్. కేవలం స్వతగానే సినిమాలలో అవకాశాలను సంపాదించుకుంటూ వస్తోంది. ఇప్పటికే శృతిహాసన్ రెండుసార్లు ప్రేమలో ఫెయిల్ అయ్యిందని ఇండస్ట్రీలో టాక్ అయితే వినిపిస్తూ ఉన్నది.. ఎంత బిజీగా ఉన్నప్పటికీ శృతిహాసన్ అభిమానులతో అప్పుడప్పుడు చిట్ చాట్ వంటివి నిర్వహిస్తూ సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటుంది. అయితే తాజాగా శృతిహాసన్ అభిమానులతో ఒక చిట్ చాట్ సెషన్ నిర్వహించడం జరిగింది. ఈ సమయంలోనే చాలామంది ఆమెకు సంబంధించి పలు ప్రశ్నలు అడగడం జరిగింది.
అభిమానుల ప్రశ్నలకు వెర్రి సమాధానం..
చాలామంది అడిగిన ప్రశ్నలలో శృతిహాసన్ మీ పెళ్లి ఎప్పుడు? ఎలాంటి వారిని చేసుకుంటారు ? ఇప్పటి వరకు మీరు ఎందుకు వివాహం చేసుకోలేదు ? అంటూ పలు రకాల ప్రశ్నలు అడిగారు. అయితే ఈ ప్రశ్నలకు సైతం శృతిహాసన్ కాస్త సీరియస్ గానే ఈసారి సమాధానంతో చెక్ పెట్టినట్టుగా తెలుస్తోంది.. ఇది 2024.. ఆడవారిని వివాహం గురించి అడగడం ఇప్పటికైనా మానేయండి.. ఇలాంటి వెర్రి ప్రశ్నలు అడిగి మీ విలువైన సమయాన్ని వృధా చేయడం మానుకోండి అంటూ తెలిపింది .. మీరు ఇకపై మీ పనుల పైన ఎక్కువగా దృష్టి పెట్టండి.. మీ వ్యక్తిగత విషయాల గురించి ఆలోచించండి అంటూ ఒక పోస్ట్ ని సైతం షేర్ చేసింది శృతిహాసన్. ఏదేమైనా ఇలాంటి సమాధానము ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది శృతిహాసన్ మరి ఇకనైనా తన పెళ్లి గురించి ప్రశ్నలు రాకుండా ఉంటాయేమో అంటూ అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు.
శృతిహాసన్ సినిమాలు..
శృతిహాసన్ సినిమాల విషయానికి వస్తే.. గత ఏడాది ప్రభాస్ సరసన సలార్ సినిమాలో నటించి పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు దక్కించుకున్న ఈమె.. ప్రస్తుతం డైరెక్టర్ లోకేష్ కనగరాజు తో కలిసి ఒక మ్యూజిక్ ఆల్బమ్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.. మరొకవైపు హీరోయిన్ గా పలు భాషలలో నటిస్తూ ఉంది. ఒకవైపు తన నటనతో ఎంతోమందిని ఆకట్టుకుంటున్న శృతిహాసన్ తన నిజ జీవితంలో ప్రేమ విషయంలో మాత్రం ఫెయిల్ అవుతూనే ఉందనే విషయం పైన కాస్త అభిమానులు అసహనంతో ఉన్నారు. మరి ఇప్పటికైనా తన పెళ్లి గురించి అడగొద్దంటూ క్లారిటీగా చెప్పిన ఈమె ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందో చూడాలి.
View this post on Instagram