Shyamal Devi: 40 యేళ్ళ క్రితమే కల్కి స్టార్ట్.. కానీ..!

Shyamala Devi.. దివంగత నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి ఇటీవలే తన కొడుకు రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం గురించి మాట్లాడుతూ పలు ఆశ్చర్యకర విషయాలు వెల్లడించారు. 40 ఏళ్ల క్రితమే కృష్ణంరాజు ఈ సినిమాను మొదలుపెట్టారని.. కానీ కొన్ని కారణాలవల్ల ఆగిపోయిందని.. అయితే ఇప్పుడు అదే కల్కి పేరిట ఆయన వారసుడు ప్రభాస్ పూర్తి చేసి ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారని వెల్లడించారు శ్యామలాదేవి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

Shyamal Devi: Kalki started 40 years ago.. But..!
Shyamal Devi: Kalki started 40 years ago.. But..!

40 యేళ్ళ క్రితమే కల్కి టైటిల్ తో మూవీ..

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898AD చిత్రం జూన్ 27న విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ సందర్భంగా శ్యామలాదేవి మీడియా ముందుకు వచ్చి పలు విషయాలు పంచుకున్నారు. మరి ఆమె మాటల్లోనే ఈ విషయాలు విందాం.. శ్యామలాదేవి మాట్లాడుతూ దాదాపు 40 సంవత్సరాల క్రితమే.. కల్కి టైటిల్ తో ఒక సినిమా చేయాలని అనుకున్నారు.. ఈ సినిమాలో ఒక పాట కూడా రికార్డు చేయడం జరిగింది. ఎం ఎం కీరవాణి తన మొదటి పాట కల్కి  చిత్రం కోసమే చేశారు.. సూర్యనారాయణ రాజు తనకు మొదటి రెమ్యూనరేషన్ ఇచ్చారని కీరవాణి కూడా చెప్పుకొచ్చారు.. అంతేకాదు కీరవాణి పూజ గదిలో కల్కి చిత్రం కోసం రికార్డు చేసిన పాట కూడా ఉందట . కారణం తెలియదు కానీ కల్కి టైటిల్తో కృష్ణంరాజు చేయాలనుకున్న సినిమా ఆగిపోయింది..

తండ్రి అనుకున్న టైటిల్ తో ప్రభాస్ సినిమా పూర్తీ..

కానీ ఇప్పుడు డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ప్రభాస్ తో కల్కి అవతారం నేపథ్యంలో కల్కి 2898AD అనే చిత్రం చేయడం చాలా ఆనందంగా ఉంది.. ఈ సినిమాకి ముందుగా ప్రాజెక్టుకే అని టైటిల్ పెట్టారు.. కానీ కల్కి అని టైటిల్ ఫిక్స్ చేయడం జరిగింది. అలా 40 యేళ్ళ క్రితం కృష్ణంరాజు అనుకున్న ఈ సినిమాని ఇప్పుడు ఆయన వారసుడు ప్రభాస్ పూర్తి చేయడం యాదృచ్ఛికం అనే చెప్పాలి. మొత్తానికి అయితే తండ్రి అనుకున్న కథను కొడుకు పూర్తి చేయడం నిజంగా తనకు పూర్తి ఆనందాన్ని ఇచ్చింది అని శ్యామలాదేవి చెప్పుకొచ్చింది.

- Advertisement -

కల్కి 2898AD:

కల్కి సినిమా విషయానికి వస్తే.. దాదాపు 5 సంవత్సరాల కష్టం తర్వాత తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. మొదటి రోజు సుమారుగా రూ.191.5 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. అంతేకాదు భారతదేశంలోనే మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల జాబితాలో మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఇక ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ , విజయ్ దేవరకొండ, మృనాల్ ఠాగూర్ , దుల్కర్ సల్మాన్, దీపికా పదుకొనే, దిశాపటాని మాళవికా నాయర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అంతేకాదు 18 ఏళ్ల తర్వాత ప్రముఖ తెలుగు నటి శోభన కూడా ఈ సినిమాలో భాగం కావడం ఆశ్చర్యకరమనే చెప్పాలి.. ఇలా ఎవరికి వారు తమ నటనకు ప్రాణం పోసి పాత్రలో జీవించేశారు. అందుకే ఈ సినిమా ఇప్పుడు కలెక్షన్ల పరంగా భారీ వసూళ్లు సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు