Shyamala Devi: ప్రభాస్ పెద్దమ్మ పై రామ్ చరణ్ అభిమానులు ఫైర్.. కారణం..?

Shyamala devi.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ ఫిలిం కల్కి 2898ఏడి.. ఈ సినిమా మొదటి రోజు నుంచే భారీ కలెక్షన్లు వసూలు చేస్తూ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాదు.. విదేశాలలో కూడా రికార్డులు క్రియేట్ చేసింది.. ఇక ఇందులో అమితాబ్ బచ్చన్, కమలహాసన్ వంటి లెజెండ్రీ నటులు కీలక పాత్రలు పోషించారు. మొత్తానికైతే కల్కితో తిరిగి ఫామ్ లోకి వచ్చేసిన ప్రభాస్ ను ఇప్పుడు ఈయన పెద్దమ్మ శ్యామలాదేవి ఒక రిక్వెస్ట్ చేశారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితంపై ఒక సినిమా చేయమని ప్రభాస్ ని కోరుతానని కూడా ఆమె తెలిపారు.

Shyamala Devi: Ram Charan's fans fire on Prabhas' peddama.. the reason..?
Shyamala Devi: Ram Charan’s fans fire on Prabhas’ peddama.. the reason..?

ప్రభాస్ ని రిక్వెస్ట్ చేస్తున్న పెద్దమ్మ శ్యామలాదేవి..

అసలు విషయంలోకి వెళితే.. హైదరాబాదులోని ట్యాంకు బండ్ ను వద్ద ఏర్పాటు చేసిన క్షత్రియ సేవా సమితి కార్యక్రమంలో పాల్గొన్న శ్యామలాదేవి మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు.. ఇక్కడ అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.. ఈ వేడుకల్లో పాల్గొన్న ఈమె మాట్లాడుతూ పలు విషయాలను షేర్ చేశారు.. వాస్తవానికి అల్లూరి సీతారామరాజు పాత్రను కృష్ణం గారు చేద్దామని అనుకున్నారు.. అయితే ఆయనను ఆ పాత్రలో చూడాలని మేమంతా కూడా కోరుకున్నాము.. కానీ ఆ తర్వాత కృష్ణ గారు చేశారు.. వాస్తవానికి ఆ పాత్రను సీనియర్ ఎన్టీఆర్ గారు చేయాలనుకున్నారు.. కానీ అవకాశం కృష్ణ గారికి లభించింది.. చాలా మంచి సినిమా బాగా హిట్ అయింది.ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ క్యారెక్టర్ లో ప్రభాస్ ని చూడాలని నాతో పాటు అభిమానులు కూడా కోరుకుంటున్నారు.. వారి విన్నపాన్ని ఇప్పుడు నేను బాబుకి వినిపిస్తాను.. ఆ క్యారెక్టర్ ఏ మాత్రం అవకాశం ఉన్నా సరే ప్రభాస్ ని చేయమని కోరుతాను. ప్రభాస్ ను ఈ పాత్రలో చూస్తే ఖచ్చితంగా అల్లూరి సీతారామరాజు మళ్ళీ పుట్టినట్లు అనిపిస్తుందని అభిమానులు అంటున్నారు.. అది కూడా నేను ప్రభాస్ కు చెబుతాను అంటూ శ్యామలాదేవి తన మాటను అభిమానుల మాటగా చెప్పబోతుందని సమాచారం.

పార్లమెంటులో అల్లూరి సీతారామరాజు విగ్రహం..

ఇకపోతే 15 సంవత్సరాల క్రితం పార్లమెంటులో అల్లూరి విగ్రహం ప్రతిష్టించాలని కృష్ణం రాజు ఎంతో ప్రయత్నించారు.. అప్పటి స్పీకర్ మీరా కుమార్ తో సమావేశమై ఈ విషయంపై అనుమతి కోరారు.. కానీ కొన్ని కారణాలవల్ల నెరవేరలేదు… కానీ మేము ఇప్పుడు విగ్రహం గురించి రాష్ట్రపతి ని, ప్రధానమంత్రి ని కోరుతాము అంటూ శ్యామలాదేవి చెప్పుకొచ్చింది.

- Advertisement -

శ్యామలాదేవి పై రామ్ చరణ్ అభిమానులు ఫైర్..

ఈ విషయంపై రామ్ చరణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో అద్భుతంగా నటించారు.. ఈ పాత్ర రామ్ చరణ్ తప్ప మరెవరి చేసినా తాము ఒప్పుకోమని.. ఆ పాత్రలో రామ్ చరణ్ ను మాత్రమే ఊహించుకుంటామని ఖరాకండిగా చెప్పేస్తున్నారు.. మరి దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ గట్టిగానే కౌంటర్లు ఇస్తూ ఉండడం గమనార్హం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు