Siddharth: మిస్ యూ అంటూ సిద్దార్థ్ పోస్ట్… సూపర్ ట్విస్ట్ ఇచ్చాడు గా

Siddharth: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో స్టార్ హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి హీరో సిద్ధార్థ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తన అభిమానులను అలరించి అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా మారాడు. బాయ్స్ సినిమాతో కెరీర్ ప్రారంభించి తెలుగు, తమిళంలో అనేక సినిమాల్లో నటించి మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. ప్రస్తుతం సిద్ధార్థ్ కెరీర్ లో సినిమాలు పెద్దగా లేవు.

అయినప్పటికీ ఈ హీరోకి క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. చాలాకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి సిద్ధార్థ్ ఇప్పుడిప్పుడే తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. కొత్త కొత్త ప్రాజెక్టులను అనౌన్స్ చేస్తున్నాడు. సిద్ధార్థ్ నటించిన సినిమా మిస్ యూ. కలథిల్ సంతిప్పోమ్, మాప్లా సింగం చిత్రాల ఫేమ్ ఎన్. రాజశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, ఆశిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ ను ప్రముఖ నటుడు శివ కార్తికేయన్ ఎక్స్ వేదికగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో రైల్వే స్టేషన్ నుంచి సిద్ధార్థ్ వస్తున్నట్లుగా ఉంది.

Siddharth, Ashika Ranganath's 'Miss You' 1st look poster out - India Today

- Advertisement -

చాలా రోజుల తర్వాత సిద్ధార్థ్ ఈ పోస్టర్లో చాలా కొత్తగా కనిపిస్తారు. 7 మైల్స్ ఫర్ సెకండ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శామ్యూల్ మాథ్యూ ఈ సినిమాను నిర్మిస్తుండగా…..ఈ సినిమాకు జీబ్రాన్ సంగీతం అందించాడు. కరుణాకరన్, బాల, సాస్తిక రాజేంద్రన్ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇక చాలా రోజుల తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సిద్ధార్థ్ కి ఈ సినిమా ప్లస్ అవ్వాలని తన అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు.

https://x.com/Siva_Kartikeyan/status/1798588296911814673

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు