Siddharth : అదేదో ఫ్లోలో మాట్లాడాడు గురు… ఇప్పుడు వచ్చింది రియలైజేషన్

Siddharth : లవర్ బాయ్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మణిరత్నం దగ్గర కొన్ని సినిమాలుకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సిద్ధార్థ్ శంకర్ దర్శకత్వం వహించిన బాయ్స్ సినిమాతో నటుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా ఊహించిన విజయాన్ని అందుకోలేకపోయింది. కానీ సిద్ధార్థ కి అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఆ టైంలోనే తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా అనే సినిమాను చేశాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత చేసిన బొమ్మరిల్లు సినిమా తెలుగు ప్రేక్షకులకి సిద్ధార్థ ను మరింత దగ్గర చేసింది.

పేరుకు తమిళ్ హీరో అయినా కూడా తెలుగులో సిద్ధార్థ్ కి ఒకప్పుడు మంచి క్రేజ్ ఉండేది. మంచి బ్లాక్ బస్టర్ సినిమాలు సిద్ధార్థ లిస్టులో ఉన్నాయి. కేవలం తెలుగులోనే కాకుండా అటు తమిళ్ లోనూ, బాలీవుడ్ లో కూడా రంగ్ దే బశాంతి వంటి అద్భుతమైన హిట్ సినిమాలు చేశాడు. ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో సిద్ధార్థ క్రేజ్ బాగా తగ్గిపోయింది. సిద్ధార్థ కి కొంచెం ఆటిట్యూడ్ ఎక్కువ అని కూడా కామెంట్స్ వినిపిస్తూ వస్తుంటాయి. ఇక రీసెంట్ గా సిద్ధార్థ నటించిన సినిమా ఇండియన్ 2. ఈ సినిమా జులై 12న రిలీజ్ కి సిద్ధంగా ఉంది ఈ తరుణంలో ఈ చిత్ర యూనిట్ హైదరాబాద్ లోనే ఒక ప్రెస్ మీట్ లో పాల్గొంది.

Siddharth

- Advertisement -

ప్రెస్ మీట్ లో పాల్గొన్న సిద్ధార్థ ను డ్రగ్స్, నార్కోటిక్స్ గురించి తెలంగాణ ప్రభుత్వ సీఎం కొన్ని నిమిషాల పాటు వీడియో చేసి అవేర్నెస్ కల్పించమన్నారు దీని గురించి మీరు ఏం చెబుతారు అని ఒక సినీ జర్నలిస్ట్ అడిగినప్పుడు. 2005లో నేను కండోమ్ యాడ్ చేశాను. బాధ్యత అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. సీఎంతో చెప్పించుకోవలసినంత స్థితిలో యాక్టర్ ఉండకూడదు అని మాట్లాడాడు. అయితే దీన్ని చాలా మంది రకరకాలుగా రాసి చివరికి సిద్ధార్థ తోనే మళ్లీ క్లారిటీ ఇచ్చే విధంగా చేశారు. ఇండియన్ టు చిత్ర యూనిట్ అంతా కూడా డ్రగ్స్ ను నిషేదించాలి అంటూ ఒక వీడియోని చేసి రిలీజ్ చేసింది. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో దీనిపై డిస్కషన్ మొదలైంది. స్టేజ్ పైన అంత యాటిట్యూడ్ తో మాట్లాడి తరువాత ఇలా కూల్ గా వీడియో చేయడం ఏంటి అని సిద్ధార్థ ను కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు