Siddharth: సుమతో ఈవెంట్ చేసినప్పుడు కౌగిలించుకుని మాట్లాడా, నేను డార్లింగ్ అనే పిలుస్తా మీకు అభ్యంతరం ఏంటి.?

Siddharth: లవర్ బాయ్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాయ్స్ సినిమాతో నటుడుగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ అంతకంటే ముందు మణిరత్నం దగ్గర చాలా సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు సిద్ధార్థ్. అయితే పేరుకు తమిళ్ హీరో అయినా కూడా తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సిద్ధార్థ్ కు ఉంది. సిద్ధార్థ్ చేసిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు వంటి సినిమాలు అద్భుతమైన హిట్ సాధించాయి. ఆ తర్వాత కొన్ని ఫెయిల్యూర్ సినిమాలు పడినా కూడా, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్ సినిమాలు మళ్లీ సిద్ధార్థ కెరీర్ గారికి మంచి ప్లస్ అయ్యాయి. అయితే ఒక స్టేజ్ లో సిద్ధార్థ కి వరుస డిజాస్టర్ సినిమాలు పడ్డాయి.

తెలుగులో సిద్ధార్థ్ సినిమాలు రిలీజ్ అవ్వడం ఆగిపోయాయి అనుకున్న తరుణంలో, అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మహాసముద్రం సినిమాతో మళ్లీ రియంట్రీ ఇచ్చాడు. అయితే ఎన్నో అంచనాలతో వచ్చిన మహాసముద్రం సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఇక ప్రస్తుతం సిద్ధార్థ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. సినిమా జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో హైదరాబాద్ లోని ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది చిత్ర యూనిట్.

Siddharth

- Advertisement -

ఈ సినిమా ఈవెంట్ లో సిద్ధార్థ మాట్లాడిన తర్వాత సుమ ఏదో మాట్లాడబోతుంటే, ఆ చెప్పు సుమ డార్లింగ్ అన్నాడు సిద్ధార్థ. అక్కడితో ఆగకుండా సుమ భుజంపై చేయి వేసి కూడా మాట్లాడాడు అయితే లాస్ట్ టైం నేను సుమాను కౌగిలించుకొని ఈవెంట్ చేసినప్పుడు ఏంటి వీళ్లిద్దరి మధ్య అని చాలామంది అన్నారు. మేము ఇలానే ఉంటాం మీకు ఏంటి ప్రాబ్లం అంటూ సిద్ధార్థ్ చాలా కామెడీగా ఆట పట్టించాడు. వెంటనే చాలా తెలివిగా ఈ టాపిక్ ని డైవర్ట్ చేసింది సుమ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు