Siddharth: కమల్ హాసన్ కి కౌంటర్ ఇచ్చిన సిదార్థ్

Siddharth: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సిద్ధార్థ నటించిన సినిమాలో రిలీజ్ అవ్వట్లేదు. కానీ ఒకప్పుడు సిద్ధార్థ సినిమా అంటే కూడా ఒక క్రేజ్ ఉండేది. ఇప్పటికీ చాలామంది అమ్మాయిలు సిద్ధార్థ ను ఒక లవర్ బాయ్ గా ట్రీట్ చేస్తారు. అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ మొదలుపెట్టిన సిద్ధార్థ శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన హిట్ సినిమాలు చేసి లవర్ బాయ్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించి ఉన్నాడు. పేరుకు తమిళ్ హీరో అయినా కూడా తెలుగులో మంచి ఫ్యాన్స్ ను సాధించుకున్నాడు సిద్ధార్థ్.

కేవలం తెలుగు తమిళ్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్ హాలీవుడ్ లో కూడా సిద్ధార్థ సినిమాలు చేశాడు. ఇక తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం కొంచెం కష్టం , ఓయ్ వంటి ఎన్నో సినిమాలు మంచి హిట్ గా నిలిచాయి. ఇకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దాదాపు చాలా ఏళ్లు గ్యాప్ తీసుకున్న సిద్ధార్థ అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మహాసముద్రం సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఊహించిన విజయాన్ని సాధించుకోలేకపోయింది. ఇప్పుడు మళ్లీ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఇండియన్ 2 సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ లో తెరకెక్కిన సినిమా ఇండియన్ 2. అప్పట్లో వచ్చిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. భారతీయుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఇండియన్ టు సినిమా జులై 12న రిలీజ్ సిద్ధంగా ఉంది. ఇ తరుణంలో పలు రకాల ఇంటర్వ్యూస్ పాల్గొంటుంది చిత్ర యూనిట్. రీసెంట్ గా కమల్ హాసన్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ నేను ఇండియన్ టు చేయడానికి కారణం ఇండియన్ 3 సినిమా స్టోరీ నాకు నచ్చడం అంటూ చెప్పుకొచ్చారు.

- Advertisement -

INDIAN 2

అయితే దీనిపై సిద్ధార్థ స్పందించారు. కమల్ హాసన్ సార్ చెప్పినట్లు నేను చెప్పను. ఆయన ఇండియన్ 2 సినిమా చేయడానికి కారణం ఇండియన్ 3 స్క్రిప్ట్ నచ్చడం అన్నారు. కానీ నేను అలా కాకుండా ఇండియన్ సినిమా స్టోరీ మొత్తం విన్నాను. అదంతా విన్న తర్వాతే నేను సినిమా చేశాను. శంకర్ సార్ నన్ను బాయ్స్ సినిమాతో పరిచయం చేశారు. అలానే కమలహాసన్ సార్ ని కూడా నేను గురువులా భావిస్తాను అంటూ ఇద్దరు గురించి చెప్పుకొచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు