Siddhu Jonnalagadda: యంగ్ హీరోను సరి చేసిన మెగాస్టార్

Siddhu Jonnalagadda: తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రస్తావన వస్తే చిరంజీవిని మినహాయించి మాట్లాడలేము. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మెగాస్టార్ చిరంజీవి ఒక పెద్ద దిక్కు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా సమస్య వచ్చినా కూడా మెగాస్టార్ చిరంజీవి ముందుండి చాలామందిని నడిపిస్తారు. దాసరి నారాయణరావు గారు చనిపోయిన తర్వాత ఆ ప్లేస్ ని భర్తీ చేసింది మెగాస్టార్ చిరంజీవి అని అనడంలో అతిశయోక్తి లేదు. గత ప్రభుత్వంలో సినిమా టిక్కెట్ రేట్లు ఇష్యూ వచ్చినప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి దగ్గరుండి మాట్లాడి డీల్ చేశారు.

ఇకపోతే రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి పద్మభూషణ్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో చాలా మంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖుల అంతా వెళ్లి చిరంజీవిని కలిశారు. అయితే చాలామంది కూడా చిరంజీవిని కలిసి వాళ్ళ శుభాకాంక్షలు తెలియజేసి ప్రత్యేకించి బొకేలు అందించి ఫోటోలు దిగి మరీ వచ్చారు. అయితే అదే తరుణంలో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ కూడా మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఫోటో దిగారు. అయితే అప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ఫోటో దిగేముందు సిద్దు తన హెయిర్ను సరి చేసుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.

ఇకపోతే రీసెంట్ గా మరోసారి మెగాస్టార్ చిరంజీవితో సెల్ఫీ దిగాడు సిద్దు జొన్నలగడ్డ. అయితే ఇతరుణంలో సిద్దు ఫోటోను క్లిక్ చేసేటప్పుడు మెగాస్టార్ చిరంజీవి సిద్దు జొన్నలగడ్డ హెయిర్ సరి చేశారు. ఇదివరకే సిద్దు ఎలా చేసుకున్నాడు అలానే మెగాస్టార్ చిరంజీవి సిద్దు హెయిర్ ని సెట్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దీనిని బట్టి చాలామంది మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు అన్ని ట్రోల్స్ మీన్స్ అబ్జర్వ్ చేస్తారు అంటూ కొంతమంది పోస్ట్ పెట్టడం మొదలుపెట్టారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు