Telusukada : సిద్ధూ సినిమా లాంగ్ షెడ్యూల్.. అప్పుడే హీరోయిన్ల ఎంట్రీ

Telusukada : టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరోల్లో ఒకరైన సిద్ధూ జొన్నలగడ్డ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. డీజే టిల్లు తో మంచి క్రేజీ సంపాదించుకున్న ఈ హీరో, ఈ ఇయర్ టిల్లు స్క్వేర్ తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇక ఇప్పుడు సిద్ధూ చేతిలో ఏకంగా నాలుగు సినిమాలున్నాయని సమాచారం. ప్రస్తుతం రెండు సినిమాల్లో వరుస షెడ్యూల్ లలో నటిస్తున్నాడు సిద్ధూ. బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తున్న జాక్ సినిమా షెడ్యూల్ రీసెంట్ గానే ముగించగా, ప్రస్తుతం ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కు కొంత గ్యాప్ ఇచ్చారు. అయితే సిద్ధూ మాత్రం బ్రేక్ తీసుకోకుండా నెక్స్ట్ సినిమా షూటింగ్ లో కూడా బిజీ కానున్నాడు.

Sidhu Jonnalagadda's Telusukada long schedule starts from August 5

తెలుసు కదా లాంగ్ షెడ్యూల్..

ఇదిలా ఉండగా సిద్ధూ జొన్నలగడ్డ మరో సినిమా షూటింగ్ కి రెడీ అవుతున్నాడు. ప్రముఖ కాస్ట్యూమ్స్ డిజైనర్ నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతుంది. ఇక ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డతో పాటు రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఆ మధ్య గ్లిమ్ప్స్ కూడా రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే కొంత కాలం ఈ సినిమా షూటింగ్ కి గ్యాప్ ఇవ్వగా, తాజాగా మళ్ళీ రెగ్యులర్ షూట్ కి రెడీ అవుతుంది. తాజా సమాచారం ప్రకారం వచ్చే నెల నుండే ఈ షెడ్యూల్ ఉండబోతుందని తెలుస్తుంది.

- Advertisement -

లాంగ్ షెడ్యూల్ ఆగష్టు లో..

ఇక సిద్ధూ నటిస్తున్న తెలుసు కదా (Telusukada) సినిమాకి సంబంధించి ఆగష్టు 5 నుండి లాంగ్ షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారని సమాచారం. ఈ షెడ్యూల్ లోనే హీరోయిన్లతో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారని సమాచారం. ఈ షెడ్యూల్ దాదాపు 20 రోజులు ఉండబోతుందని సమాచారం. ఇక తెలుసు కదా సినిమాకు థమన్.ఎస్ సంగీతం అందిస్తుండగా, సినిమాటోగ్రఫర్ గా యువరాజ్ జె వ్యవహరిస్తున్నారు. ఎడిటర్‌గా నేషనల్ అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్ శ్రీకర్ ప్రసాద్ ఉన్నారు. ఇక ఈ సినిమాను నవంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు జాక్ సినిమా షెడ్యూల్ ని కూడా పూర్తి చేస్తున్నాడు సిద్ధూ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు