SIIMA Awards 2024 : ఏంట్రా ఇది… మర్డరర్‌కి ఇన్ని అవార్డులా…? అస్సలు నమ్మలేకపోతున్నాం

SIIMA Awards 2024.. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన చిత్రాలు, నటులు, సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించి ప్రతిష్టాత్మక అవార్డుల సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ తాజాగా 12వ ఎడిషన్ తో బెస్ట్ సౌత్ ఇండియన్ సినిమాలకు అవార్డులు ఇవ్వడానికి సిద్ధమయింది.. ఈ క్రమంలోనే ఈ ఏడాది సెప్టెంబర్ 14 , 15 తేదీలలో జరగనున్న ఈ వేడుకకు దుబాయ్ వేదిక కానుంది. ఈ పురస్కారాలకు పోటీపడుతున్న చిత్రాల జాబితాను తాజాగా సైమా టీం విడుదల చేయగా.. 2023లో రిలీజ్ అయ్యి భారీ విజయాలను సొంతం చేసుకున్న చిత్రాలు ఇప్పుడు నామినేట్ అయ్యాయి.

SIIMA Awards 2024 : What is this... so many awards for a murderer...? Can't believe it at all
SIIMA Awards 2024 : What is this… so many awards for a murderer…? Can’t believe it at all

నామినేట్ అయిన చిత్రాలు..

అందులో భాగంగా అత్యధికంగా 11 విభాగాలలో తెలుగు నుంచి నాని దసరా మూవీ నామినేట్ అవ్వగా.. తమిళ్ నుంచి రజనీకాంత్ జైలర్ కూడా 11 విభాగాలలో నామినేట్ అయింది . ఇక మలయాళం మూవీ టోవినో థామస్ 2018 సినిమా తో పాటు కన్నడ మూవీ దర్శన్ కాటేరా 8 విభాగాలలో పోటీ పడబోతోంది.

కాటేరా మూవీ 8 విభాగాలలో నామినేట్..

ఇకపోతే ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే.. ఒక మర్డరర్ కి ఏకంగా 8 అవార్డులు లభించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ చిత్రమే దర్శన్ కాటేరా.. ఇటీవల దర్శన్ ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే.. ఇప్పుడు ఇతడి చిత్రం ఏకంగా 8 విభాగాలలో నామినేట్ అవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది ముఖ్యంగా ఉత్తమ చిత్రంతోపాటు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, అలాగే మేల్ విభాగంలో ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ , ఫిమేల్ వెర్షన్ లో ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ తో పాటు ఉత్తమ పాటల రచయిత, అలాగే ఉత్తమ నూతన నటులు విభాగంలో నామినేట్ అవ్వడం జరిగింది. ఇక ఇన్ని విభాగాలలో ఈ సినిమా నిలవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుందని చెప్పవచ్చు.. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు ఈ సినిమా ఇన్ని విభాగాలలో నామినేట్ అయ్యేసరికి పలువురు సెలబ్రిటీలు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

- Advertisement -

కాటేరా చిత్రం విషయానికి వస్తే..

ఇటీవలే ప్రేయసి కోసం హంతకుడిగా మారిన దర్శన్.. 2023 లో కన్నడ లో యాక్షన్ డ్రామా చిత్రం కాటేరా లో నటించాడు. ఈ చిత్రానికి తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించగా.. రాక్ లైన్ వెంకటేష్ నిర్మించారు. ఈ చిత్రంలో దర్శన్, ఆరాధన రామ్ ప్రధాన పాత్రులు పోషించగా.. జగపతిబాబు, వినోద్ కుమార్, గోవింద్, శృతి తదితరులు కీలకపాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతాన్ని హరికృష్ణ అందించగా.. రూ .45 కోట్ల బడ్జెట్లో తెరకేక్కిన ఈ సినిమా రూ .100 కోట్లు కాబట్టి రికార్డు సృష్టించింది. అంతేకాదు 1970లో కర్ణాటకలోని ఒక గ్రామంలో జరిగిన నిజ జీవిత సంఘటన నుండి ప్రేరణ పొంది ఈ సినిమాను తెరకెక్కించారు.

ఇకపోతే ఒక హత్య కేసులో ఇరుక్కున్న దర్శన్ ఇప్పుడు ఉత్తమ హీరోగా అవార్డుకి నామినేట్ అవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు