Simbaa Trailer : అనసూయకు విజయ్ దేవరకొండ లాంటి మొగుడు వస్తాడాట… మళ్లీ VDని గట్టిగానే గెలికిందిగా..?

Simba Trailer.. జబర్దస్త్ ద్వారా భారీ గుర్తింపు సొంతం చేసుకొని ఇప్పుడు సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూ వరుస సినిమాలు చేస్తోంది ప్రముఖ గ్లామర్ బ్యూటీ అనసూయ. తన అందచందాలతో యువతను ఆకట్టుకోవడమే కాదు వాక్చాతుర్యంతో ఎలాంటి షోనైనా సరే సక్సెస్ చేయగల సత్తా ఉన్న నటీమణి. ఇకపోతే తాజాగా ఈమె నటించిన చిత్రం సింబా. ఆగస్టు 9న విడుదల కాబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.ఈ ట్రైలర్లో జగపతిబాబు, అనసూయ, వశిష్టా సింహ, కస్తూరి శంకర్, కబీర్ సింగ్, గౌతమీ, అనీష్ కురువిల్లా ఇలా చాలామంది ఇందులో నటిస్తున్నారు ఈ సినిమాలో అనసూయ ఒక సైన్స్ టీచర్ పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు.. ట్రైలర్ చూస్తుంటే.. “మందు, దమ్ము కన్నా దుమ్ము వల్లే చాలామంది చనిపోతున్నారు” అంటూ జగపతి బాబు చెప్పడంతో ఈ సినిమా నేపథ్యం పొల్యూషన్ పై ఉండొచ్చని అర్థం అవుతోంది.

Simbaa Trailer : Will Anasuya get a crush like Vijay Deverakonda... as she wins VD again by a landslide..?
Simbaa Trailer : Will Anasuya get a crush like Vijay Deverakonda… as she wins VD again by a landslide..?

పొల్యూషన్ కాన్సెప్ట్ తో సింబా..

ఎందుకంటే ఈ సినిమాకు ట్యాగ్ లైన్ గా.. ఇది ఫారెస్ట్ మాన్ అని పెట్టారు.అంటే మొక్కలు నాటండి, చెట్ల వల్ల పర్యావరణం మెరుగవుతుంది. ఫలితంగా మనిషి జీవన విధానం బాగుపడుతుంది అనే కాన్సెప్ట్ తోనే సినిమాను తెరకెక్కించినట్లు అర్థమవుతుంది. ఇకపోతే ఈ సినిమాలో విజయ్ దేవరకొండను బాగానే వాడుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అనసూయకు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి లైవ్ లో నడిచిన వివాదాన్ని రీల్ లైఫ్ లో వాడేసుకున్నారు డైరెక్టర్.

అనసూయ విజయ్ దేవరకొండ వివాదం సినిమాలో కూడా..

అనసూయ టూ వీలర్ పై వస్తుంటే ఒకతను బండి తుడడానికి వచ్చి.. అక్క, నీకు మహేష్ బాబు లాంటి మొగుడు వస్తాడు అక్క అని అంటాడు. దాంతో మొహం కొంచెం అదోలా పెట్టుకుంటుంది. వెంటనే అక్క నీకు విజయ్ దేవరకొండ లాంటి మొగుడు వస్తాడు అక్క అంటాడు.. అనసూయ వెంటనే నవ్వు ముఖంతో కనిపిస్తుంది.. ఇలా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అనసూయ రియల్ లైఫ్ లో నడిచిన వివాదాన్ని ఇలా రీల్ లైఫ్ లో వాడేసుకున్నారు . మురళి మోహన్ ఈ సినిమాకు దర్శకుడిగా పనిచేస్తుండగా, ప్రముఖ దర్శకుడు సంపత్ నంది, రాజేందర్రెడ్డి ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

- Advertisement -

అర్జున్ రెడ్డి సినిమా నుంచే మొదలు..

ఇకపోతే అర్జున్ రెడ్డి సినిమా నుంచి అనసూయ విజయ్ దేవరకొండ అభిమానుల మధ్య ఒక యుద్ధమే జరిగిందని చెప్పవచ్చు. సోషల్ మీడియా వేదికగా అర్జున్ రెడ్డి సినిమాలో జరిగిన సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేసిన అనసూయ పై ఇప్పటికీ కూడా విజయ్ దేవరకొండ అభిమానులు ఏదో ఒక రూపంలో కామెంట్లు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆమె పెట్టే ఏ పోస్ట్ కైనా సరే నెగటివ్ గా కామెంట్లు చేస్తూ వివాదాన్ని మరింత సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వీరిద్దరి మధ్య జరిగిన వివాదాన్ని ఇలా సినిమాలో కూడా వాడుకోవడం ఫన్నీగా అనిపిస్తోంది. మొత్తానికి అయితే ఈ సినిమా ట్రైలర్ ఆసక్తిగా ఉంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు