Simbhu: ఒకేసారి మూడు సినిమాలు డీల్ చేయడం అంటే అది శంకర్ సార్ కి మాత్రమే సాధ్యం

Simbhu: తెలుగు ప్రేక్షకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మంచి సినిమాకు భాషతో సంబంధం లేకుండా ఆ నటులతో సంబంధం లేకుండా ఆదరించటం అనేది ఎప్పటి నుంచో వస్తున్న అలవాటుగా మారింది చాలామంది తమిళ్ హీరోస్ కి ఇక్కడ తెలుగు ప్రేక్షకులు మంచి ఆదరణను చూపిస్తారు. ఈ మధ్యకాలంలో ధనుష్, శివ కార్తికేయన్, విజయ్ ఆంటోని వంటి హీరోలకి మంచి ఆదరణ లభిస్తుంది. కానీ ఇంతకంటే ముందు సూర్య, కార్తీ, విక్రమ్, శింబు వంటి ఎంతోమంది నటులను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రేక్షకులు ఆదరించారు.

వల్లభ సినిమాతో మంచి ఆదరణ

శింబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శింబు చేసిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. తెలుగు ప్రేక్షకులు కూడా శింబు సినిమాలను ఎగబడి చూశారు. వల్లభ, మన్మధ వంటి ఎన్నో సినిమాలు తెలుగులో మంచి విజయాన్ని సాధించాయి. ఇక మధ్యకాలంలో శంభో సినిమాలు చేయటం తగ్గించాడు. రీసెంట్ గా సోనీ లైవ్ లో వచ్చిన “మానాడు” సినిమాకి మంచి ఆదరణ లభించింది. వెంకట ప్రభు ఈ సినిమాను తీసిన విధానం చాలా మందిని ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం శింబు తన కెరియర్ లో 48వ సినిమాను చేస్తున్నాడు ఈ సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి.

Simbu

- Advertisement -

శింబు మాట్లాడుతూ

రీసెంట్ గా శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆడియో లాంచ్ ను నిర్వహించింది చిత్ర యూనిట్ దీనిలో శింబు మాట్లాడుతూ… ‘నాకు ఇండియన్ సినిమా చాలా ఇష్టం. ఈ విషయాన్ని శంకర్ గారితో ఎన్నో సార్లు చెప్పాను. అసలు ఆ సినిమాను ఎన్ని సార్లు చూసి ఉంటానో లెక్క పెట్టలేదు. ఓ కమర్షియల్ సినిమా ఎలా ఉండాలి? అనే దానికి ఇండియన్ సినిమా ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇండియన్ 2 అనౌన్స్మెంట్ తరువాత ఓ అభిమానిగా ఎంతో ఎగ్జైట్ అయ్యాను. కమల్ హాసన్ గారు నాకు గురువు లాంటి వారు. థగ్స్ లైఫ్ సినిమాలో ఆయనతో కలిసి నటిస్తున్నాను. ఇప్పటికీ ఆయన అదే డెడికేషన్‌తో పని చేస్తున్నారు. అందరికీ నచ్చేలా ఇండియన్ 2 ఉండబోతోంది. ఇండియన్ 2, ఇండియన్ 3, గేమ్ చేంజర్ లాంటి భారీ సినిమాలను ఒకే టైంలో తెరకెక్కించడం మామూలు విషయం కాదు. ఇది కేవలం శంకర్ గారి వల్లే సాధ్యం అవుతుంది. లైకా సుభాస్కరన్ గారు సౌత్‌లో భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. రెడ్ జెయింట్ ఈ చిత్రయూనిట్‌కు ఎంతో సహకారాన్ని అందించారు. అనిరుధ్ పాటలు బాగున్నాయి. ఇండియన్ అనే టైటిల్‌కు తగ్గ నటుడు కేవలం కమల్ హాసన్. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి’ అని అన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు