Simran: నా జీవితంలో భరించరాని బాధ అదే.. ఎమోషనల్ కామెంట్స్..!

Simran.. తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది హీరోయిన్ సిమ్రాన్ (Simran).. ఈమె తెలుగు , తమిళ్, కన్నడ, హిందీ వంటి భాషలలో ఎన్నో చిత్రాలలో కూడా నటించింది. టాలీవుడ్లో స్టార్ హీరోల సరసన కూడా నటించింది. అప్పట్లో సిమ్రాన్ నటనకు సైతం చాలామంది ఫిదా అయ్యేవారు. అయితే నెమ్మదిగా ఫేడౌట్ అవ్వడం చేత సినిమాలకు దూరమై వివాహం చేసుకుంది సిమ్రాన్. ఇటీవలే మళ్లీ కాస్త గ్యాప్ ఇచ్చిన సిమ్రాన్ పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో నటిస్తోంది.

Simran: That is the unbearable pain in my life.. Emotional comments..!
Simran: That is the unbearable pain in my life.. Emotional comments..!

చెల్లెలి మరణాన్ని జీర్ణించుకోలేకపోయాను..

ఎప్పటికప్పుడు తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది సిమ్రాన్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సిమ్రాన్ తన చెల్లెలు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ గా మాట్లాడింది. సిమ్రాన్ ను యాంకర్ ఇలా అడగగా.. మీ జీవితంలో కష్టం అయినటువంటి రోజులు ఏంటి అని అడగగా..ఈ విషయం పైన మాట్లాడుతూ..నా జీవితంలో చాలా కష్టమైన రోజులు 2001లో గడిచాయి అంటూ తెలిపింది. అందుకు ముఖ్య కారణం మా చెల్లెలు సూసైడ్ చేసుకున్న వార్త విని షాక్ అయిపోయానంటూ తెలిపింది. అప్పుడే తమ జీవితంలో చాలా కష్టమైన రోజులుగా చాలా బాధను మిగిల్చాయని తెలిపింది సిమ్రాన్.

చెల్లెలిపై కోప్పడిన సిమ్రాన్..

కానీ ఈ నిజాన్ని ఒప్పుకొని, తన చెల్లెలు లేకపోయినా ఆమెను గుర్తు పెట్టుకొని మరీ ముందుకు సాగాలి. కానీ ప్రేమించిన వారి కోసం జీవితాన్నే ఇచ్చేస్తారా.. తనని అంతగా పెంచిన తల్లితండ్రులు , బ్రదర్స్, సిస్టర్స్ గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేరా అంటూ సిమ్రాన్ చాలా ఎమోషనల్ గా మాట్లాడడం జరిగింది. సిమ్రాన్ చెల్లెలు కూడా ఒక హీరోయిన్ ను సిమ్రాన్ అగ్ర కథానాయికగా ఉన్నటువంటి రోజులలో మోనాల్ తమిళ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలలో నటించింది. అయితే కెరియర్ ప్రారంభంలోనే తమిళంలో ఉండే ప్రముఖ కొరియోగ్రాఫర్తో ప్రేమలో పడి మోసపోయిందట.

- Advertisement -

సిమ్రాన్ చెల్లెలు ఆత్మహత్య..

అలా మోసపోయారని తెలుసుకోవడంతో మోనాల్ చిన్న వయసులోనే సూసైడ్ చేస్తుందని, ఇప్పటికి వార్తలు వినిపిస్తూ ఉంటాయి. 2001 ఏప్రిల్ 14న చెన్నైలో తన నివాసం ఉంటున్న ఇంట్లో ఉరి వేసుకొని మరీ సిమ్రాన్ చెల్లెలు మోనాల్ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం అప్పట్లో ఒక ప్రకంపన సృష్టించింది. ఇప్పటికి తన చెల్లెల్ని సైతం తలుచుకుంటూ సిమ్రాన్ ప్రతి ఏడాది కూడా ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ప్రేమించిన వ్యక్తి కోసమే ఆమె సూసైడ్ చేస్తుందని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.

సిమ్రాన్ సినిమాలు..

సిమ్రాన్ విషయానికొస్తే.. ఒకప్పుడు వరుస చిత్రాలతో స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకున్న సిమ్రాన్ ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి మరొకసారి తనని తాను నిరూపించుకుంది. ఇప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది అందులో భాగంగానే తన కెరియర్ లో మిగిలిన విషాదఛాయల గురించి చెప్పుకొచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు