Chinmayi: సీనియర్ నటి అన్నపూర్ణ పై విరుచుకుపడ్డ చిన్మయి.. కారణం..?

డబ్బింగ్ ఆర్టిస్టుగా, గాయనిగా మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న చిన్మయి సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.. ముఖ్యంగా మహిళలపై జరిగే వేధింపులు విషయంలో ఫైర్ బ్రాండ్ గా మారిపోయిన ఈమె మీటూ ఉద్యమంలో భాగంగా తరచుగా తన గళం వినిపిస్తూ ఉంటుంది. మహిళలను అవమానించేలా ఏ చిన్న సంఘటన జరిగినా సరే ఈమె ఊరుకోదు.. అంతేకాదు మీటూ ఉద్యమం చెలరేగినప్పుడు తమిళ లిరిసిస్ట్ వైరముత్తు పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. తనని లైంగికంగా వేధించినట్లు చిన్మయి సంచలన ఆరోపణలు చేసింది ..అప్పటినుంచి ఈ వివాదం రగులుతూనే ఉంది.

ఇకపోతే మహిళల ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయాలలో సైతం చిన్మయి మాట్లాడడానికి వెనుకడుగు వేయడం లేదు.. ఈ క్రమంలోనే ఇటీవల నటి అన్నపూర్ణమ్మ మహిళలని ఉద్దేశించి వ్యాఖ్యలపై చిన్మయి ఘాటుగా కౌంటర్ ఇచ్చింది.. 1975 నుంచి టాలీవుడ్లో తల్లి పాత్రలో , బామ్మ పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్న నటి అన్నపూర్ణమ్మ వందలాది చిత్రాలలో నటించింది. మహిళలకి స్వాతంత్రం లేదు అంటూ కామెంట్స్ చేసింది అన్నపూర్ణమ్మ.. ఈమె మాట్లాడుతూ.. ఆడవారికి ఎందుకు స్వాతంత్రం కావాలి? అర్ధరాత్రి ఆడవాళ్లకు ఏం పని ఉంటుంది.. ఎదుటి వాళ్ళు మనల్ని ఏమీ అనకూడదని అనుకున్నా.. మనం మాత్రం ఏదో ఒక కామెంట్ చేసే విధంగానే బట్టలు వేసుకొని ఎక్స్పోజింగ్ చేస్తున్నాము అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

అంతేకాదు తప్పు అనేది ఎదుటి వాళ్ళ పైనే కాదు.. మన వైపు కూడా ఉంటుందని ఆలోచించాలి అని అన్నపూర్ణమ్మ చెప్పగా.. ఈ వీడియో పై చిన్మయి సోషల్ మీడియాలో బదులిచ్చింది.. అన్నపూర్ణమ్మ వ్యాఖ్యలపై సెటైరికల్ గా కామెంట్లు చేసింది.. నా ఫేవరెట్ అనుకున్న వాళ్ళు ఇలా మాట్లాడితే గుండె ముక్కలు అవుతుంది.. ఆమె చెబుతున్న రూల్స్ ప్రకారం ఆడవాళ్లకు మెడికల్ ఎమర్జెన్సీ రాత్రివేళల్లో రాకూడదు.. రాత్రి వేళల్లో మహిళలు నర్సులుగా పని చేయకూడదు.. మహిళలు రాత్రి వేళలో బిడ్డలకు జన్మనివ్వకూడదు.. కనీసం బాత్రూం సౌకర్యం లేని గ్రామాలు ఉన్న ఇండియాలో మనం ఉంటున్నాము.. చీకటి పడ్డాక.. సూర్యోదయానికి ముందు మాత్రమే బాత్రూం కోసం బయటకు వెళ్లాల్సిన దుస్థితి చాలా గ్రామాలలో ఉంది..

- Advertisement -

కానీ అన్నపూర్ణమ్మ చెప్పిన మాటలు వింటుంటే మాత్రం మహిళలు కనీసం అవసరానికి కూడా బయటకు వెళ్ళకూడదు అన్నట్లు ఉంది అంటూ ఆమె రెచ్చిపోయింది.. అంతేకాదు వాళ్ళ మాటలు వింటుంటే ఇండియాలో మహిళలుగా ఎందుకు పుట్టాం అనిపిస్తుంది ముఖ్యంగా ఇండియాలో ఆడవాళ్లకు కర్మ కాలింది అంటూ కూడా సెటైర్లు వేసింది ఈ ముద్దుగుమ్మ… ప్రస్తుతం అన్నపూర్ణమ్మ వ్యాఖ్యలను తిప్పికొడుతూ చిన్మయి కామెంట్లు చేయడం వైరల్ గా మారింది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు