Chinmayee: దేశాలు తిరిగా.. కానీ ఇండియాలోనే రేప్ చేశారు.. చిన్మయి..!

ప్రముఖ సింగర్ చిన్మయి సమాజంలో ఆడవాళ్లపై జరిగే అన్యాయాలను ఎదిరిస్తూ తన గళం విప్పి మాట్లాడుతూ ఉంటుంది.. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న ఆడవాళ్లు అర్ధరాత్రి తిరగడం ఏంటి? ఏం అవసరం ? అంటూ అన్నపూర్ణమ్మ మాట్లాడిన మాటలు మీద సింగర్ చిన్మయి మండిపడిన విషయం తెలిసిందే.. అన్నపూర్ణమ్మ మాట్లాడిన మాటల ప్రకారం రాత్రిపూట ఎమర్జెన్సీ సర్వీసులు ఉండకూడదు.. ఆడవాళ్లు పనిచేయకూడదు…అసలు ఈ దేశంలో ఇలాంటి మనస్తత్వాలు ఉన్నాయి.. ఇలాంటి దేశంలో పుట్టడం కర్మ అన్నట్టుగా చిన్మయి చెప్పుకొచ్చింది.. ఇండియా గురించి మాట్లాడుతూ.. స్టుపిడ్ కంట్రీ అని అనడంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.. దీంతో ఈమె పై కేసులు కూడా వేశారు.. ఇండియాని వదిలి వెళ్ళు.. అరబ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో బ్రతుకు. అప్పుడు నీకు తెలుసొస్తుంది అంటూ చిన్మయి మీద ట్రోలింగ్ చేశారు.. ఆ ట్రోలింగ్ మీద చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేసింది.. నేనున్న కోపంలో నాకు అనుభవమైన సంఘటనలను ఆధారంగా చేసుకొని.. ఇక్కడ జరిగే అన్యాయాల గురించి ఈ దేశం గురించి మాట్లాడుతున్నాను అంటూ తెలిపింది..

స్పానిష్ మహిళ పరిస్థితిపై చిన్మయి స్పందన..
తాజాగా ఒక స్పానిష్ మహిళ తన భాగస్వామితో కలిసి బైక్ మీద ట్రావెలింగ్ చేస్తూ.. దేశ విదేశాలు తిరుగుతూ ఇండియాకి చేరుకున్న ఆమె అప్పటికే ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్, అరబ్ దేశాలను చుట్టేసింది. కానీ ఇండియాలో ఏం జరిగింది? ఆమెను ఏడుగురు గ్యాంగ్ రేప్ చేశారు అంటూ చిన్మయి ఇండియాలో జరుగుతున్న ఒక ప్రస్తుత పరిస్థితి గురించి వెల్లడించింది. ఇక ఆ వీడియోని ఆమె షేర్ చేయడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. మీరు చెప్పింది నిజమే.. ఇండియాలో ఇలాంటి ఘోరాలు ఎక్కువగా జరుగుతున్నాయి… అలా అని దేశం మొత్తాన్ని మీరు ఎలా అంటారు? ఇది చాలా తప్పు.. అంటూ కొంతమంది కామెంట్లు చేస్తుండగా.. మరి కొంతమంది.. నువ్వు కూడా ఆ దేశాలకు వెళ్లి జీవించు.. ఇక్కడ ఎవరు ఉండమన్నారు.. అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Chinmayi Sripada (@chinmayisripaada)

- Advertisement -

స్పానిష్ మహిళపై సామూహిక అత్యాచారం..
అసలు విషయంలోకి వెళితే స్పెయిన్ కి చెందిన 28 ఏళ్ల మహిళ.. 64 ఏళ్ల తన భర్తతో కలిసి ఇండియాకి విహారయాత్రకు వచ్చింది.. బంగ్లాదేశ్ నుంచి దుమ్కాకి చేరుకొని బీహార్ మీదుగా నేపాల్ కు వెళ్తున్నారు.. అయితే రాత్రి సమయం కావడంతో జార్ఖండ్ లోని రాంచీ కి 300 కిలోమీటర్ల దూరంలో దుమ్కా జిల్లాలో హంసదిహా పోలీస్ స్టేషన్ పరిధిలో కురు మహత్తులో ఆమె తన భర్తతో కలిసి డేరా లో రాత్రి గడపగా..ఆ సమయంలో ఆమెపై ఏకంగా ఏడుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు సి ఆర్ పి సి సెక్షన్ 164 కింద ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు తెలిపారు.. ఇకపోతే మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించి అత్యాచారం జరిగినట్లు నిర్ధారించిన పోలీసులు. ఈ నేరానికి పాల్పడిన ఏడుగురిని అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నించగా అందులో ముగ్గురిని జైలుకి పంపించగా మిగతా నలుగురు పరారీలో ఉన్నట్లు స్పష్టం చేశారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని కూడా తెలిపారు.. ఇక ఈ ఘటనపైనే సింగర్ చిన్మయి స్పందించి ఈ విధంగా ఆగ్రహం చెందినట్లు తెలుస్తోంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు