Singer Damini : పచ్చబోట్టేసిన అంటూ సంగీత ప్రియుల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్న దామిని..బర్త్ డే స్పెషల్..

Singer Damini : సంగీతం అంటే మక్కువతో ఎంతో మంది సింగర్లు ఇండస్ట్రీలోకి వచ్చారు.. అందులో కొందరు మాత్రమే తమ టాలెంట్ తో వరుస సినిమాల్లో పాడే అవకాశాలను అందుకుంటూ స్టార్ సింగర్స్ గా కొనసాగుతున్నారు.. అలాంటి వారిలో సింగర్ దామిని భట్ల కూడా ఒకరు.. ఆమె అతి చిన్న వయసులోనే స్టార్ సింగర్స్ లిస్ట్ లోకి చేరింది.. ఇటీవల బిగ్ బాస్ లో కూడా సందడి చేసింది.. నేడు ఆమె పుట్టినరోజు సందర్బంగా ఆమె గురించి మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఈమె సంగీతం అంటే ఉన్న ఇష్టంతో చిన్న వయసులోనే శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత గాయనిగా మారింది. ఈ క్రమంలోనే ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నడిపించిన ‘పాడుతా తీయగా’ షోలో పాల్గొంది. ఆ తర్వాత ‘జీ సరిగమప లిటిల్ చాంపియన్’ అనే షోలోనూ కంటెస్టెంట్‌గా వచ్చింది. ఆ షోలల్లో తన టాలెంట్ తో విజేతగా నిలిచింది.. మొదట ప్లే బ్యాక్ సింగర్ గా కేరీర్ ను మొదలు పెట్టింది.. ఆ తర్వాత బాహుబలి సినిమాలోని పచ్చబొట్టేసిన అనే సాంగ్ తో సింగర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది..

Singer Damini Birthday Special Songs
Singer Damini Birthday Special Songs

ఆ పాట ఎంత హిట్ టాక్ ను అందుకుందో అందరికీ తెలుసు.. ఇంటర్నెషనల్ గా ఈ పాట సంగీత ప్రియుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది.. ఆ పాటతో దామినికి వరుస అవకాశాలు వచ్చాయి.. పలు హిట్ సినిమాల్లో కూడా ఆమె గొంతును అందించింది.. ఆ క్రేజ్ తో గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 7 లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది.. అయితే సింగర్ గా బాగా ఆకట్టుకుంది.. కానీ హౌస్ లో పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.. కొద్ది రోజులకే ఇంటినుంచి బయటకు వచ్చేసింది.. ఇక నేడు ఈమె పుట్టినరోజు. ఇలాంటి మరెన్నో పుట్టినరోజులను జరుపుకోవాలని Filimfy ఛానెల్ ద్వారా కోరుకుంటున్నాం.. వెరీ హ్యాపీ బర్త్ డే దామిని.. ఈ సందర్బంగా ఈమె పాడిన అద్భుతమైన పాటలను ఒకసారి విని తరిద్దాం..

- Advertisement -

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు