Singer Kanye West : పాపులర్ సింగర్ కాన్యే వెస్ట్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు

Singer Kanye West : ప్రముఖ అమెరికన్ గాయకుడు, రాపర్, ఫ్యాషన్ డిజైనర్, వ్యవస్థాపకుడు కాన్యే వెస్ట్‌పై లైంగిక వేధింపుల కేసులో చిక్కుకున్నాడు. అతని మాజీ అసిస్టెంట్ లారెన్ పిస్కాట్ కాన్యే పై ఈ కేసును దాఖలు చేశారు.

అసలు వివాదం ఏంటంటే?

కాన్యే తన కొత్త ఫ్యాషన్ బ్రాండ్ ‘యీజీ’ని ప్రారంభించినప్పుడు లారెన్‌ను తన అసిస్టెంట్ గా నియమించుకున్నాడు. ‘యీజీ’ కొన్ని నెలల్లోనే ప్రముఖ బ్రాండ్‌గా మారింది. ఫ్యాషన్ బ్రాండ్‌తో పాటు, లారెన్ కాన్యే ఆల్బమ్‌లలో ఒకదానిలో లారెన్ కాన్యేతో కలిసి పని చేశారు. అద్దెకు తీసుకున్న ఒక సంవత్సరం తర్వాత లారెన్ ‘ఓన్లీ ఫ్యాన్స్’ అనే ఫ్యాన్ పేజీని తొలగిస్తే 8.35 కోట్లు ఇస్తానని లారెన్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ తరువాత మొదలైంది అసలు వివాదం. లారెన్ కు తరచుగా అసభ్యకర మెసేజ్ లు, వీడియోలు పంపుతూ లైంగిక వేధింపులకు పాలపడ్డాడు కాన్యే.

ప్రైవేట్ విషయాలు కూడా అడిగేవాడు

కాన్యే మాజీ అసిస్టెంట్ లారెన్ అతను తనకు పంపిన వీడియో, అసభ్య సందేశాలి పంపాడు అంటూ ఆరోపించింది. ఈ విషయం గురించి లారెన్ మాట్లాడుతూ కాన్యే నాకు కాల్ చేసి నేను ఇప్పుడు ఏమి చేస్తున్నానో ఊహించు అని అడిగేవాడని, అలాగే నా బాయ్‌ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్ పరిమాణంతో సహా ఇతర విషయాల గురించి నన్ను అసభ్యకరమైన ప్రశ్నలు అడిగానని ఆరోపించింది.

- Advertisement -

Kanye West Accused of Sexual Harassment by Former Assistant | Complex

ప్రూఫ్స్ తో సహ ఇరికించిందిగా!!

కాన్యే లారెన్‌కు చాలా అసభ్యకరమైన సందేశాలను పంపారు. లారెన్ ఆ సందేశాలను ఏకంగా మీడియాతో పంచుకున్నారు. లారెన్‌ తో కాన్యే విచిత్రమైన లైంగిక డిమాండ్లు చేసినట్లు ఇప్పుడు విడుదలైన మెసేజ్ లు చూస్తే అర్థం అవుతుంది. కాన్యే లారెన్‌కి కొన్ని అశ్లీల వీడియోలను కూడా పంపాడు. వాటిలో కొన్ని అతని స్వంత ప్రైవేట్ వీడియోలు అని లారెన్ చెప్పారు. కాన్యే కొంత మంది మోడల్స్‌తో సె*క్స్ చేసి, దానిని వీడియో తీసి లారెన్‌కి పంపినట్టు ఆమె వెల్లడించింది. మొత్తానికి కేవలం లైంగికంగా వేధించాడు అంటూ ఆరోపించడమే కాకుండా ప్రూఫ్స్ తో సహ కాన్యే బండారాన్ని బయట పెట్టింది.

25 కోట్లు ఇచ్చి బయటకు గెంటేశారా?

కాన్యే వెస్ట్ లారెన్‌ తన దగ్గర పని చేస్తున్న సమయంలో ఆమెకు ఏడాదికి 33 కోట్ల జీతం ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే ఏడాది రెండు సార్లు ఆమెకు కాన్యే కంపెనీలో జాబ్ లో పదోన్నతి లభించింది. కాన్యే అక్టోబర్ 2022లో లారెన్‌ను తన కంపెనీ నుంచి తొలగించి, 25 కోట్లు చెల్లించిన తర్వాత ఆమెను బయటకు పంపారు. అయితే ఆమెను ఇలా డబ్బిచ్చి ఎందుకు బయటకు గెంటేశారు అనేది తెలియాల్సి ఉంది. కాగా ఈ విషయంపై ఇంకా కాన్యే రియాక్ట్ కాలేదు. మరి తనను కోర్టుకీడ్చిన తన మాజీ మేనేజర్ గురించి ఆయన ఎలాంటి కామెంట్స్ చేస్తారో చూడాలి.

కాన్యేపై దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు

తాజాగా లారెన్ చేసిన ఆరోపణల నేపథ్యంలో కాన్యేపై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఒక అసిస్టెంట్ తో ఇలా ఎలా చేస్తారు అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు