Nani: సార్ ఏంటి, అన్న అని పిలు – నాని

Nani: ప్రస్తుత కాలంలో నాని చేస్తున్న సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. జెర్సీ(Jersey) సినిమా తర్వాత నాని చేసిన ప్రతి సినిమా ఒక ప్రత్యేకమైన చెప్పాలి. ప్రస్తుతం నాని నుంచి ఒక సినిమా వస్తుంది అని అంటే ఆ సినిమా ఒక మంచి కాన్సెప్ట్ అని, మంచి సినిమాను నాని ఎన్నుకుంటాడు అని అందరికీ ఒక స్థాయి నమ్మకం వచ్చేసింది. ఇక నాని రీసెంట్ టైమ్స్ లో చాలామంది కొత్త కొత్త దర్శకులను పరిచయం చేయడం కూడా మొదలుపెట్టాడు. నాని వలన దర్శకులుగా పరిచయమైన వాళ్ళు అవార్డులు కూడా రీసెంట్ గా అందుకున్నారు. ఇక నాని వివేక్ ఆత్రేయ(Vivek Athreya) కాంబినేషన్లో వచ్చిన సినిమా అంటే సుందరానికి. ఈ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేక పోవడం వల్ల, మళ్ళీ వివేకాత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం(Saripodha Sanivaram) అనే సినిమాను చేసాడు నాని. నేడు ఆ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.

ఈ తరుణంలో ట్విట్టర్ వేదికగా చాలామంది అభిమానులతో ముచ్చటించారు నాని(Nani). అయితే నాని చేస్తున్న సరిపోదా శనివారం సినిమాకి ఆల్ ది బెస్ట్ చెబుతూ హీరో తేజ సజ్జ నాని సార్ అంటూ ట్వీట్ లో రాసుకొచ్చాడు. దీనికి నాని స్పందిస్తూ సార్ ఏంటి అన్నా అని పిలు అంటూ రెస్పాండ్ అయ్యాడు. మామూలుగా ఒక స్టార్ ఇమేజ్ ఉన్న హీరోస్ ను సార్ అని పిలవడం అలవాటుగా కొంతమందికి మారుతుంది. అయితే కొంతమంది దానిని తీసుకునే విధానం కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నాని మాత్రం అన్నా అని పిలవమనటం చాలామందికి మంచి పాజిటివ్ థింగ్ లా అనిపించింది.

Nani

- Advertisement -

ఒక బాల నటుడుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తేజ ప్రస్తుతం హీరోగా సినిమాలు చేయటం మొదలు పెట్టాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఎక్కువ సినిమాలు చేశాడు తేజ. ఇక రీసెంట్ గా తేజా నటించిన హనుమాన్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది స్టార్ హీరోలతో పాటు సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా కేవలం మౌత్ టాక్ తో అద్భుతమైన హిట్ అయి 100 కోట్ల మార్కెట్లోకి చేరిపోయింది. ఈ సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు తేజ. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోస్ లో చాలా పద్ధతిగా తన కెరీర్ ను ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు తేజ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు