Sita Ramam Teaser : హిట్టు కళ కనిపిస్తుంది !

మమ్ముట్టి కొడుకుగా మలయాళ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు దుల్కర్ సల్మాన్. కానీ, తెలుగులో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ‘ఓకే బంగారం’ ‘మహానటి’ ‘కనులు కనులను దోచాయంటే’ చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు దుల్కర్ ను దగ్గర చేశాయి. దీంతో స్ట్రైట్ తెలుగు మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు దుల్కర్. అదే ‘సీతా రామం’. ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’ అనేది క్యాప్షన్. ‘అందాల రాక్షసి’ ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ ‘లై’ ‘పడి పడి లేచే మనసు’ లాంటి విభిన్న కథా చిత్రాలతో క్రేజ్ ను సంపాదించుకున్న హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకుడు. ‘వైజయంతీ మూవీస్’ సమర్పణలో ‘స్వప్న సినిమా’ పతాకంపై అగ్ర నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

టీజర్ విషయానికి వస్తే 1965 వ సంవత్సరంలో కాశ్మీర్ లో నివసిస్తున్న రామ్‌ అనే సైనికుడి కథ. రామ్ ఒక అనాథ. మాట్లాడడానికి కానీ, ఉత్తరం రాయడానికి ఒక్కరు కూడా ఉండరు. ఇలా ఒంటరితనం తో యుద్ధం చేస్తున్న ఓ వ్యక్తికి ’నేను మీ భార్యను‘ అంటూ సీతామహాలక్ష్మీ అనే అమ్మాయి ఉత్తరం రాస్తుంది. ఆ సీతామహాలక్ష్మీ ఎవరో రామ్ కి తెలీదు. మరి సీతామహాలక్ష్మీని రామ్ ఎలా కనిపెడతాడు. ఎలా కలుస్తాడు? హీరో అతనికి ఎలా పరిచయం? అనే క్యూరియాసిటీని క్రియేట్ చేస్తూ టీజర్ ను కట్ చేశారు. ఒక నిమిషం 14 సెకన్లు నిడివి గల ఈ టీజర్ చూడటానికి చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంది. విశాల్ చంద్ర శేఖర్ అందించిన సంగీతం, సినిమాటోగ్రాఫర్ పి.ఎస్.వినోద్ అందించిన విజువల్స్ టీజర్ కు హైలెట్ గా నిలిచాయి. ఆగస్టు 5న ఈ చిత్రం విడుదల కాబోతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు