Sitara Ghattamaneni: నాన్న నటించిన సినిమాల్లో ఎప్పటికీ నా ఆల్ టైం ఫేవరెట్ మూవీ అదే

Sitara Ghattamaneni: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కూతురు సితార ఘట్టమనేని(Sithara Ghattamaneni) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తన తండ్రి సూపర్ హిట్ పాటలను రీల్స్ గా కూడా ఒక్కోసారి సితార షేర్ చేస్తూ ఉంటారు. ఇక సితారతో ఆడుకుని వీడియోస్ ని కూడా మహేష్ instagram వేదికగా షేర్ చేస్తూ ఉంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలలో తనకిష్టమైన సినిమా ఖలేజా అని, ఆ సినిమాలో సీతారామరాజు క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా ఉంటుందని, ఒక ఇంటర్వ్యూలో రీసెంట్ గా చెప్పుకొచ్చారు సితార.

త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) మహేష్ బాబు దర్శకత్వంలో వచ్చిన రెండవ సినిమా ఖలేజా(Khaleja). వీరిద్దరి కాంబినేషన్లో మొదటి అతడు(Athadu) అనే సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ సాధించి పోయినా కూడా టీవీల్లో మంచి టిఆర్పి రేటింగ్ను నమోదు చేసుకుంటుంది. అతడు సినిమాలో మహేష్ బాబు చాలా తక్కువగా మాట్లాడుతాడు. సినిమాలు మిగతా పాత్రలు మాట్లాడే మాటలు పంచ్ డైలాగ్స్ అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి కానీ ఈ సినిమా అప్పట్లో పెద్దగా ఎక్కలేదు. ఇప్పుడు చూస్తే మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ బెస్ట్ వర్క్ అనిపిస్తుంది.

Khaleja

- Advertisement -

వీరి కాంబినేషన్లో వచ్చిన ఖలేజా సినిమా కూడా ఊహించిన స్థాయిలో ఆడలేదు. కానీ మహేష్ బాబు లోని పరిపూర్ణమైన నటుడును బయటికి తీసిన సినిమా ఖలేజా. త్రివిక్రమ్ శ్రీనివాస్ సీతారామరాజు అనే క్యారెక్టర్ ని డిజైన్ చేసిన విధానం ఇప్పటికే ఒక రేంజ్ లో ఉంటుంది. మహేష్ బాబు కెరియర్ లో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన సినిమా అంటే ఖలేజా అని చెప్పాలి. ఈ సినిమా చాలామందికి ఫేవరెట్ ఫిలిం, ఈ సినిమాను మళ్ళీ రీ రిలీజ్ చేస్తే కొత్త రికార్డులు కూడా సృష్టిస్తుందని చెప్పాలి. ఇక చాలామందికి నచ్చినట్లే సితార కు కూడా ఈ సినిమా బాగా ఇష్టమని తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు