Sithara Ghattamaneni : నా మొదటి యాడ్ ఫిలిమ్ చూసి నాన్న ఏడ్చారు

Sithara Ghattamaneni : ప్రతి ఫీల్డ్ లో కూడా వారసత్వం అనేది ఉంటుంది. కానీ సినిమా అనే పరిశ్రమ చాలా పెద్దది కాబట్టి మనం ఇష్టపడే నటులు అలానే ఇష్టపడే దర్శకులు వారి కుమారుల గురించి లేదా కుమార్తెల గురించి మనకంటూ ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ విషయానికి వస్తే ఇప్పుడు ఉన్న చాలామంది హీరోలు ఏదో ఒక బ్యాక్ గ్రౌండ్ వలన వచ్చిన వాళ్లే. అలానే వారసత్వం వలన కూడా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే వారసత్వం అనేది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పూర్తిగా స్థిరపడడానికి ఉపయోగపడదు. కేవలం సినిమా ఓపెనింగ్ వరకు మాత్రమే వారసత్వం పనికి వస్తుంది. ఆ తర్వాత తమకు ఉన్న టాలెంట్ వాళ్లని ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు. చాలామంది స్టార్ హీరోల కొడుకులు కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తమ ప్రతిభను చూపించారు. అయితే స్టార్ హీరోల కూతుర్లు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడానికి ఆసక్తి చూపించరు. ఇక పాత తరం కాకుండా ఈ తరంలో తెలుగు సినిమా పరిశ్రమలో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో నిహారిక కొణిదెల(Niharika) ఒకరు. మొదట టీవీ యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఆ తరువాత ఒక మనసు సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే హీరోయిన్ గా చేసిన రెండు మూడు సినిమాలు కూడా వర్కౌట్ కాలేదు. అక్కడితో నిర్మాతగా కూడా తన ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంది.

Mahesh Babu's daughter Sitara

- Advertisement -

ఇకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా చిన్న వయసులోనే తండ్రి మహేష్ బాబు బాటలో నడుస్తుంది సితార. తనకొచ్చిన రెమ్యూనరేషన్ కూడా పరులకు సాయం చేయడం కోసమే ఉపయోగిస్తుంది. రీసెంట్ గా సితార ఒక యాడ్ ఫిలిం చేసిన సంగతి తెలిసిందే. ఇదే యాడ్ ఫిలిం గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలా ఫీలయ్యారు అని ఒక యాంకర్ అడిగినప్పుడు. ఆ యాడ్ ఫిలిం చూసి నాన్న ఏడ్చారు అంటూ సితార చెప్పుకొచ్చారు. తన కూతురు ఆ స్థాయికి రావడం వెనక సూపర్ స్టార్ ఆనంద భాష్పాలు పెట్టుకున్నారు అని చాలామందికి సితార చెప్పిన మాటలతో అర్థమైంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు