Mahesh Babu: మంచి చేయడంలో తండ్రిని మించిన సితార… రెమ్యునరేషన్ మొత్తం ఏం చేసిందంటే…?

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మహేష్ తో పాటు ఆయన భార్య నమ్రత, కూతురు సితార కూడా స్టార్లే. ఒక గౌతమ్ మాత్రం కాస్త వీటికి దూరంగా ఉంటూ..చదువుపై దృష్టి పెట్టాడు. కానీ తన కూతురు సితార మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పెద్దగా సినిమాలు చేయకపోయినా మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకుంది.

7వ తరగతి చదివే అమ్మాయిలో ఇంత మెచ్యూర్డ్ ఆలోచనలు ఏంటి అనేలా బిహేవ్ చేస్తుంది సితార. ఇక మాట తీరు, మంచితనం కూడా మహేష్ ని మించిపోయే విధంగా ఉన్నాయి. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే సితార తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమె తన రెమ్యునరేషన్ ని విరాళంగా ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచింది.

Sitara surpasses her father in doing good
Sitara surpasses her father in doing good

ఒక ప్రకటన ద్వారా కోటి రూపాయలను సంపాదించిన సితార..ఆ రెమ్యునరేషన్ ని స్వచ్ఛంద సంస్థకు అందించి అందరినీ ఆశ్చర్యపరిచింది. మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే. టాలీవుడ్ తో పాటు ఆయనకు అన్ని భాషల్లో ఫ్యాన్స్ ఉన్నారు. కృష్ణ వారసత్వాన్ని అందుపుచ్చుకుని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక మహేష్ తనకి వచ్చే సంపాదనలో కొంత అనాధాశ్రమానికి కేటాయిస్తూ ఉంటారు. ఇక ఆ మంచితనమే సితారా కి కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు.‌ వయసులో చిన్నది అయినప్పటికీ ఇంత గొప్ప పని చేసి గ్రేట్ అనిపించుకుంది సితార.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు