Sithara Ghattamaneni : డాక్టర్ కావాలని అనుకునే పేద విద్యార్థికి సితార భారీ సాయం… పోస్ట్ చేసి మురిసిపోయిన తల్లి

Sithara Ghattamaneni : టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయకున్నా దేశ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులున్నారు. అంతే కాదు తన ఫౌండేషన్ ద్వారా ఎన్నో వందల వేల చిన్న పిల్లలకు ఆపరేషన్లు చేయించి ఆయా కుటుంబాల్లో దేవుడిగా నిలిచిపోయాడు. ఇప్పటికీ మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పేదలకు సాయం చేస్తూ గొప్ప మనిషిగా నిలిచిపోయాడు. ఇక తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ కూతురు సితార ఘట్టమనేని అందరిచేత శభాష్ అనిపించుకుంటుంది. తాజాగా ఓ పేద విద్యార్థిని కి అండగా సితార భారీ సాయం చేసింది. సితార చేసిన ఈ గొప్ప పనికి సర్వత్రా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.

Sithara Ghattamaneni help poor student Navya Sri

పేద విద్యార్థినికి అండగా సితార…

తాజాగా మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని ఓ పేద విద్యార్థిని చదువుకు అండగా నిలిచింది. అసలు విషయానికి వస్తే… కూలీ పనులు చేసుకునే ఓ దినసరి కూలీ తన కూతురు నవ్యను చదివించేందుకు ఎంతో శ్రమించాడు. నవ్య తన NEET పరీక్షలలో టాప్ గ్రేడ్‌ లను స్కోర్ చేసి, 605 మార్కులను తెచ్చుకుంది. అయితే తన తండ్రికి పెద్ద చదువులు చదివించే ఆర్థిక స్థోమత లేకపోగా, ఆ అమ్మాయిని చదివించడానికి, ఆమె డాక్టర్ కావడానికి, సితార ముందుకొచ్చింది. మహేష్ బాబు ఫౌండేషన్, మరియు సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్ ద్వారా, నవ్యశ్రీ ని చదివించేందుకు సాయం చేసింది. సితార బర్త్ డే రోజున తనతో పాటు కేక్ కట్ చేసి నవ్యశ్రీ కి 1,25,000 రూపాయల చెక్ ని అందచేసింది. దాంతో పాటు స్టెత స్కోప్ ని, లాప్ టాప్ ని అందచేసింది.

- Advertisement -

కూతురి గొప్ప పనికి మురిసిపోయిన నమ్రతా..

ఇక నవ్య శ్రీ మెడికల్ స్కూల్ నుండి గ్రాడ్యుయేట్ అయ్యే వరకు, ఆమె ఫీజులు మరియు విద్యా ఖర్చులను మహేష్ బాబు ఫౌండేషన్ అందిస్తుందని సితార చెప్పడం జరిగింది. ఇక సితార తన పుట్టినరోజును నవ్య శ్రీ తో కలిసి జరుపుకోగా, ఆ రోజున నవ్యకు ల్యాప్‌టాప్ మరియు స్టెతస్కోప్‌ను బహుమతిగా ఇచ్చింది. ఇక ఈ విషయాన్నీ తల్లి నమ్రతా శిరోద్కర్ ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియచేస్తూ తన కూతురు చేసిన మంచిపనిని సంతోషం తో షేర్ చేసింది. ఇక సితార ఇంతకు ముందు కూడా తన పుట్టినరోజులని పలు అనాధాశ్రమాల్లో కూడా జరుపుకోవడం విశేషం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు