Sithara Ghattamaneni : పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రికను గనుకొని పొగడగ

Sithara Ghattamaneni

పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా
పుత్రుని గనుకొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ…!

తాత్పర్యం :
తండ్రికి కుమారుడు పుట్టగానే… సంతోషం కలుగదు. మంచి సంస్కారవంతంగా అతడు ఎదిగి, పదిమందిచేత మంచివాడని అనిపించుకున్న రోజునే ఆ తండ్రికి నిజమైన సంతోషం కలుగుతుందని సుమతీ శతకకారుడి భావన.

ప్రతి ఫీల్డ్ లో కూడా వారసత్వం అనేది ఉంటుంది. కానీ సినిమా అనే పరిశ్రమ చాలా పెద్దది కాబట్టి మనం ఇష్టపడే నటులు అలానే ఇష్టపడే దర్శకులు వారి కుమారుల గురించి లేదా కుమార్తెల గురించి మనకంటూ ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ విషయానికి వస్తే ఇప్పుడు ఉన్న చాలామంది హీరోలు ఏదో ఒక బ్యాక్ గ్రౌండ్ వలన వచ్చిన వాళ్లే. అలానే వారసత్వం వలన కూడా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే వారసత్వం అనేది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పూర్తిగా స్థిరపడడానికి ఉపయోగపడదు. కేవలం సినిమా ఓపెనింగ్ వరకు మాత్రమే వారసత్వం పనికి వస్తుంది. ఆ తర్వాత తమకు ఉన్న టాలెంట్ వాళ్లని ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

- Advertisement -

Sitara Ghattamaneni

ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు. చాలామంది స్టార్ హీరోల కొడుకులు కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తమ ప్రతిభను చూపించారు. అయితే స్టార్ హీరోల కూతుర్లు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడానికి ఆసక్తి చూపించరు. ఇక పాత తరం కాకుండా ఈ తరంలో తెలుగు సినిమా పరిశ్రమంలో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో నిహారిక కొణిదెల ఒకరు. మొదట టీవీ యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఆ తరువాత ఒక మనసు సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే హీరోయిన్ గా చేసిన రెండు మూడు సినిమాలు కూడా వర్కౌట్ కాలేదు. అక్కడితో నిర్మాతగా కూడా తన ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంది.

ఇకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా చిన్న వయసులోనే తండ్రి మహేష్ బాబు బాటలో నడుస్తుంది సితార. తనకొచ్చిన రెమ్యూనరేషన్ కూడా పరులకు సాయం చేయడం కోసమే ఉపయోగిస్తుంది. మహేష్ బాబు సినిమాలలో హీరోలా కనిపించడమే కాకుండా బయట కూడా చాలామందికి గుండె ఆపరేషన్లు చేస్తూ ఉంటారు. ఇక సితార కూడా చిన్న ఏజ్ లోనే తన ప్రతిభతో సంపాదించిన డబ్బులను కూడా చిన్న పిల్లలకు దానం చేస్తూ వస్తుంది.

సితారకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్

సితార ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంస్టాగ్రామ్ లో తన తండ్రి మహేష్ బాబు నటించిన సూపర్ హిట్ పాటలను రీ క్రియేట్ కూడా చేస్తుంది. సినిమాల్లోకి అఫీషియల్ గా ఎంట్రీ ఇవ్వక ముందు నుంచే సితారకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక సితార ఫిలిం ఇండస్ట్రీకి ఎంటర్ ఇస్తే ఖచ్చితంగా ఆడియన్స్ బ్రహ్మరథం పడతారు. సుమతి శతకంలో చెప్పినట్లు మహేష్ బాబు ఆ పుత్రికోత్సవాన్ని ఎప్పుడు అనుభవించారు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సితార పుట్టినరోజు సందర్భంగా ఫిల్మీపై తరఫునుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు