Siva Karthikeyan: తెలుగు టైటిల్ ను తమిళ్ సినిమాకి ఫిక్స్ చేశాడు

Siva Karthikeyan: ముందుగా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపించాడు శివ కార్తికేయన్. అయితే రెమో సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు శివ కార్తికేయన్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా తర్వాత శివ కార్తికేయన్ చేసిన కొన్ని సినిమాలు తెలుగులో వచ్చినా కూడా పెద్దగా ఆదరణను సాధించలేదు. అయితే నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన వరుణ్ డాక్టర్ సినిమా అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత రిలీజ్ అయిన డాన్ సినిమా కూడా మంచి రెస్పాన్స్ ను అందుకుంది.

శివ కార్తికేయన్ తెలుగు ఫ్యాన్స్

ఇకపోతే తెలుగు ప్రేక్షకులకి భాషతో సంబంధం లేకుండా ఒక సినిమాను చూడటం అనేది ఎప్పటినుంచో అలవాటుగా మారిపోయింది. ఒక మంచి సినిమా వస్తే దానిని ఆదరించడంలో ఎప్పుడూ ముందుంటారు తెలుగు ప్రేక్షకులు. తెలుగులో శివ కార్తికేయన్ సినిమాలు రాకపోయినా కూడా తమిళ్లో తన సినిమాలు చూసి అభిమానించిన ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇకపోతే డాక్టర్, డాన్ సినిమాలతో వరుస హిట్ల అందుకున్న తర్వాత డైరెక్ట్ తెలుగు సినిమాకి పనిచేశాడు శివ కార్తికేయన్. అనుదీప్ కె.వి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు.

అమరన్ సినిమా అప్డేట్

ప్రస్తుతం శివ కార్తికేయన్ అమరన్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాలో మేజర్ ముకుంద వరదరాజన్ పాత్రలో శివ కార్తికేయన్ కనిపిస్తున్నాడు. ఈ సినిమాకి రాజ్ కుమార్ పెరియ సామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో శివ కార్తికేయన్ సరసన సాయి పల్లవి నటిస్తుంది. ఈ సినిమాను రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ బ్యానర్లపై కమల్ హాసన్ నిర్మిస్తున్నారు.

- Advertisement -

The Don combination is back

Sk 24 అప్డేట్

డాన్ సినిమాకు తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు శిబి చక్రవర్తి. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. ఆ సినిమా తర్వాత తెలుగు హీరో నానితో శిబి సినిమా చేస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయినట్లు తెలుస్తుంది. ఇప్పుడు మళ్లీ ఆ దర్శకుడు శివ కార్తికేయన్ తో సినిమాను చేస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాకి బాస్ అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే టైటిల్ తో తెలుగులో నాగర్జున హీరోగా సినిమా కూడా వచ్చింది. మొత్తానికి మొదటి సినిమాకి డాన్ రెండవ సినిమాకి బాస్ అని రెండు నాగార్జున టైటిల్స్ వాడేసాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు