Sivakarthikeyan: శివ కార్తికేయన్ మూవీలో బాలీవుడ్ విలన్, మళ్లీ తుపాకీ సినిమా రేంజ్

Sivakarthikeyan: శివ కార్తికేయన్ కేవలం తమిళ ప్రేక్షకులకు మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితం. ఎన్నో సినిమాలతో తెలుగులో కూడా మంచి గుర్తింపును సాధించుకున్నాడు శివ కార్తికేయన్. తెలుగులో చాలామంది హీరోలు కష్టపడి తమకంటూ ఒక సొంత గుర్తింపును సాధించుకున్నట్లు. శివ కార్తికేయన్ కూడా తమిళ్లో చాలా కష్టపడి తనకంటూ ఒక గుర్తింపును సాధించుకున్నాడు. ముందు టీవీల్లో కనిపించి అక్కడ నుంచి మెల్లమెల్లగా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసాడు. ఆ తర్వాత హీరోగా నిలబడ్డాడు. మంచి కాన్సెప్ట్ సినిమాలు ఎన్నుకుంటూ ఈరోజు ఒక స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు.

రీసెంట్ గా తెలుగులో గుర్తింపు

రీసెంట్ టైమ్స్ లో తమిళ్ సినిమాలు కూడా తెలుగులో రెగ్యులర్ డబ్బింగ్ అవుతూ వస్తున్నాయి. అయితే శివ కార్తికేయన్ నటించిన తమిళ సినిమాలు కూడా తెలుగులో రిలీజ్ అయ్యాయి. అనుదీప్ కేవీ దర్శకత్వంలో మొదటిసారి ప్రిన్స్ అనే తెలుగు సినిమాలోని డైరెక్ట్ గా నటించాడు శివ కార్తికేయన్. ఈ సినిమా తెలుగులో మంచి రెస్పాన్స్ ను సాధించింది. కానీ తమిళ్లో మాత్రం ఊహించిన స్థాయిలో ఆడలేదు. తమిళ్లో అప్పటికే రెండు 100 కోట్ల సినిమాలు శివ కార్తికేయన్ కెరియర్లో ఉన్నాయి. దర్శకుడు అనుదీప్ కె.వి శివ కార్తికేయను ఇన్నోసెంట్ గా చూపించి ఒక ప్రాపర్ లవ్ స్టోరీని తనతో డిజైన్ చేసాడు. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ ఊహించని స్థాయిలో కమర్షియల్ గా హిట్ కాలేదు.

వరుసగా హిట్ సినిమాలు

కొలమావు కోకిల సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నెల్సన్ దిలీప్ కుమార్. శివ కార్తికేయన్ వరుణ్ డాక్టర్ అనే సినిమాను చేశాడు. ఈ సినిమా అద్భుతమైన హిట్ అయింది. డార్క్ కామెడీ జోనర్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. తెలుగులో కూడా అదే స్థాయిలో ఆడింది. ఈ సినిమా తర్వాత శిబి చక్రవర్తి దర్శకుడుగా పరిచయమైన సినిమా డాన్. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ను రాబట్టింది. శివ కార్తికేయన్ కెరియర్ లో ఇది ఒక బెస్ట్ ఫిలిం అని చెప్పొచ్చు. ఈ రెండింటితో వరుసగా హిట్ సినిమాలు అందుకోవడమే కాకుండా తెలుగులో కూడా ఒక మార్కెట్ ను సృష్టించుకున్నాడు.

- Advertisement -

Thuppakki

మురగదాస్ దర్శకత్వంలో

శివ కార్తికేయన్ ఇప్పటివరకు తన కెరీర్లు 22 సినిమాలను పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం 23వ సినిమాను ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో శివ కార్తికేయన్ సరసన రుక్మిణి వసంత నటిస్తుంది. ఈ సినిమాలో శివ కార్తికేయను కు విధంగా విద్యుత్ జమాల్ కనిపించనున్నాడు. శివ కార్తికేయను కు విలన్ గా విద్యుత్ జమాల్ కనిపించనున్నాడు. ఇదివరకే మురగదాస్ దర్శకత్వం వహించిన తుపాకీ సినిమాలో కూడా విద్యుత్ విలన్ పాత్రలో కనిపించాడు. ఏ సినిమాలో కూడా కనిపిస్తుండడంతో తుపాకీ రేంజ్ లో ఉండబోతుందంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు