Sardar2 : సర్దార్ లో ఎంట్రీ ఇచ్చిన విలక్షణ నటుడు

Sardar2 : కోలీవుడ్ స్టార్ కార్తీ హీరోగా నటించిన ‘సర్దార్’ ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండేళ్ల కింద వచ్చిన ఆ సినిమా కోలీవుడ్ తో పాటు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ అయింది. PS మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా వంద కోట్లకి పైగా వసూలు చేసింది. ఇక ఈ సినిమాకు రెండో పార్ట్ వస్తుందని అప్పట్లోనే మేకర్స్ అనౌన్స్ చేసారు. అయితే ఈ సినిమా కార్యరూపం దాల్చడానికి చాలా రోజులు పట్టింది. ఎట్టకేలకు నాలుగు రోజుల కింద ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలయింది. చిత్ర యూనిట్ తో కలిసి సింపుల్ గా ఈ సినిమాని ప్రారంభించిన మేకర్స్ షూటింగ్ ని కూడా తొందరగా మొదలుపెడుతున్నట్టు అనౌన్స్ చేసారు. దాదాపు 80 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్ లక్ష్మణ్ కుమార్ సర్దార్2 సినిమాను నిర్మించనున్నారు.

SJ Surya is playing the villain role in Sardar2 movie

సీక్వెల్ లో ఎంట్రీ ఇచ్చిన విలక్షణ నటుడు…

ఇక సర్దార్2 సీక్వెల్ జులై 12న చెన్నైలో స్టూడియోలో మొదలుకాగా, నిన్నటి నుండే షూటింగ్ పనులు కూడా మొదలయ్యాయి. ఇక ఈ రెండో పార్ట్ కంబోడియా మిషన్‌ నేపథ్యంలో సినిమా నడుస్తుందని సమాచారం వచ్చింది. ఇక ఈ సినిమాలో కార్తీ రా ఏజెంట్‌ గా కనిపించనున్నాడని తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్ ని మేకర్స్ ప్రకటించారు. సర్దార్2 లో విలక్షణ నటుడు ఎస్.జె.సూర్య నటిస్తున్నాడని మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించడం జరిగింది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇక షూటింగ్ లో ఇప్పటికే కార్తీ, ఎస్.జె. సూర్య పాల్గొన్నారని సమాచారం.

- Advertisement -

సర్దార్2 లో హీరోయిన్..

ఇక సర్దార్2 (Sardar2) సినిమాలో ఎస్.జె. సూర్య ఎంట్రీ ఇచ్చాడని మేకర్స్ ప్రకటించారని అనౌన్స్ చేసారు. కానీ హీరోయిన్ గురించి మాత్రం ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. మరి ఫస్ట్ పార్ట్ లో అయితే రాశి ఖన్నా నే హీరోయిన్ గా నటించింది. మరి రెండో పార్ట్ లో కూడా రాశినే కొనసాగిస్తారా? లేదా మరో హీరోయిన్ ని తీసుకుంటారా అనేది తెలియాలి. ఇక సర్దార్2 సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తుండగా, జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ లో లేదా ఆగష్టు లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు