SJ Suryah: ఇలాంటి నటులే తెలుగు ఇండస్ట్రీకి అవసరం

SJ Suryah: సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న విలక్షణమైన నటులలో ఎస్ జె సూర్య ఒకరు. అయితే నటుడి కంటే ముందు ఎస్ జె సూర్య ఒక దర్శకుడిగా చాలామందికి పరిచయం. ఎస్ జె సూర్య దర్శకుడుగా కూడా మంచి హిట్ సినిమాలును అందుకున్నాడు. కేవలం తమిళ్ ప్రేక్షకులు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా సూర్య పరిచయం. దీనికి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భూమిక జంటగా నటించిన ఖుషి సినిమాని చెప్పొచ్చు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన హిట్ అయింది. ఇకపోతే తెలుగులో నాని అని మహేష్ బాబు తో ఒక సినిమాను తెరకెక్కించాడు సూర్య. ఆ సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు. కానీ మహేష్ బాబుకి ఆ సినిమాతో మంచి పేరు వచ్చింది. మళ్లీ ఎస్ జె సూర్య పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కాంబినేషన్లో కొమరం పులి(Komaram Puli) అని ఒక సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది.

నటుడుగా గుర్తింపు

ఇక రీసెంట్ టైమ్స్ లో ఎస్ జె సూర్య నటుడుగా కూడా నిలదొక్కుకుంటున్న విషయం తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన మానాడు సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించాడు సూర్య. అలానే మురగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమాలో కూడా ఒక విలన్ రోల్ లో కనిపించాడు. ఆ సినిమాతో సూర్యకి మంచి గుర్తింపు లభించింది. రీసెంట్ గా వస్తున్న తమిళ్ సినిమాల్లో కీలక పాత్రలలో కనిపిస్తున్నాడు. ఇక ధనుష్(Dhanush) దర్శకత్వం వహించిన రాయన్ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించాడు సూర్య.

నానికి ధీటుగా

ప్రస్తుతం వివేక్ ఆత్రేయ(Vivek Athreya) దర్శకత్వంలో నాని నటిస్తున్న సరిపోదా శనివారం అనే సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించాడు ఎస్ జె సూర్య. అయితే ఈ సినిమాలో నానికి ఎంత మేరకు స్కోప్ ఉంటుందో అదే మాదిరిగా ఎస్ జె సూర్యకి కూడా ఉంది. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే నాని ఈ సినిమాకు సంబంధించిన ఫంక్షన్ లో ఈ సినిమా చూసిన వెంటనే ఫస్ట్ టాపిక్ అందరూ మాట్లాడుకునేది ఎస్ జె సూర్య పర్ఫామెన్స్ గురించి. ఆ తర్వాత అందరూ సినిమా గురించి మాట్లాడుకుంటారు అంటూ చెబుతూ వచ్చాడు. ఇక ఈ సినిమాకి సంబంధించి దాదాపు ఇదే జరిగింది.

- Advertisement -

S J Suryah

ఇక ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ కూడా ఈ చిత్ర యూనిట్ జరిపింది. ఈ సక్సెస్ మీట్ కి షూటింగ్ వలన ఎస్ జె సూర్య హాజరు కాలేకపోయారు. అయితే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సూర్య ట్విట్టర్ వేదిక సక్సెస్ మీట్ కి రాలేకపోయాను సారీ అని చెబుతూ ఎక్స్ప్లనేషన్ ఇచ్చాడు. విలక్షణమైన నటుడిగా తెలుగు సినిమాల్లో ప్రూవ్ చేసుకోవడమే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో సినిమా అయిపోయిన తర్వాత కూడా ఎలా ఉండాలి అని తెలుసుకున్న ఇలాంటి నటులు ఉండటం అరుదు ఇలాంటి నటులే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అవసరం.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు