SJSuryah : డేడికేషన్ అంటే ఇదే అండి… బర్త్ డే విషెస్ లో కూడా సినిమా ప్రొమోషన్ వదల్లేదు

SJSuryah : సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న విలక్షణమైన నటులలో ప్రస్తుతం ఎస్ జె సూర్య పేరు వినిపిస్తుంది. నటుడిగా కంటే ముందు సక్సెస్ఫుల్ దర్శకుడుగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు సూర్య. ఎస్ జె సూర్య అని చెప్పగానే అందరికీ గుర్తొచ్చే సినిమా ఖుషి. తమిళ్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో కూడా అద్భుతమైన సక్సెస్ సాధించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో చాలా స్టైలిష్ గా కనిపించిన సినిమా అంటే ఖుషి అని చెప్పాలి. తెలుగు సినిమా చరిత్రలో ఖుషి సినిమాకు సంబంధించి ఎప్పటికి ఒక ప్రత్యేకమైన కల్ట్ స్టేటస్ ఉంటుంది.

రీసెంట్ గా ఈ సినిమాను మరోసారి విడుదల చేశారు. ఈ సినిమా రీ రిలీజ్ కూడా మంచి రెస్పాన్స్ లభించింది. ఇక నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఎస్ జె సూర్య విషెష్ తెలిపారు. హ్యాపీ బర్త్డే మై ఫ్రెండ్, పవర్ స్టార్, డిప్యూటీ సీఎం, ది లీడర్ పవన్ కళ్యాణ్ గారు అంటూ ఫ్లవర్ సింబల్స్ పెట్టి హవె గ్రేట్ హియర్ అనే నమస్కరిస్తూ ఎస్ జె సూర్య అలియాస్ సిఐ దయ అని ట్విట్టర్ లో పెట్టాడు ఎస్ జె సూర్య. ఇక దయ క్యారెక్టర్ విషయానికి వస్తే వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన సరిపోదా శనివారం అనే సినిమాలో ఒక పాత్రను పోషించాడు సూర్య. ప్రస్తుతం ఆ సినిమా థియేటర్లో సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ బర్త్డే విషెస్ లో కూడా తన డెడికేషన్ ని ఏ మాత్రం వదలకుండా మరోసారి సరిపోదా శనివారం సినిమాలోని తన క్యారెక్టర్ ని గుర్తు చేశాడు ఎస్ జె సూర్య.

- Advertisement -

ఇక ఎస్ జె సూర్య విషయానికి వస్తే ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమాలో భైరవుడు అనే పాతర్లు కనిపించాడు. ఆ పాత్ర చాలా బాగా పాపులర్ అయింది. మహేష్ బాబు కంటే సూర్యకి ఆ సినిమాతో ఎక్కువ పేరు వచ్చిందని చెప్పాలి. ఇప్పటికీ కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ లో ఆ సినిమాకి సంబంధించిన ఇమేజెస్ కనిపిస్తూ ఉంటాయి. లేకపోతే ఎస్ జె సూర్య నుంచి దర్శకత్వం కూడా కోరుకునే ప్రేక్షకులు ఉన్నారు. ముఖ్యంగా ఖుషి 2 సినిమా చేస్తే చూడటానికి చాలామంది క్యూరియాసిటీ తో ఎదురు చూస్తున్నారు.

SJ.Suryah

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు