Skn : ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఇలా ఉండాలి

Skn: ఎస్ కే ఎన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా జర్నలిస్టుగా కెరియర్ స్టార్ట్ చేసి నిర్మాత స్థాయి వరకు ఎదిగారు. సినిమాని ప్రేమించడం ఎస్ కే ఎన్ కు బాగా తెలుసు. ఒక కథను నమ్మి దానికోసం ఎంత రిస్క్ అయినా చేయడం నిర్మాతగా తన అలవాటైపోయింది. బేబీ సినిమాకు ముందు తను ఎంతో ఇష్టంగా కొనుక్కున్నా ఒక ఇల్లును కూడా అమ్ముకున్నాడు. ఒక దర్శకుడు పైన ఆయన పెట్టుకున్న నమ్మకం అలాంటిది. ఆ తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద బేబీ సినిమా బీభత్సమైన ఘనవిజయాన్ని సాధించి దాదాపు 50 కోట్లకు పైగా వసూలు చేసింది. అక్కడితో మళ్ళీ స్టార్ హీరోస్ అంటూ కాకుండా మినిమం గ్యారంటీ ఉన్న సినిమాలు చేసుకుంటూ కెరియర్ లో ముందుకు వెళ్తున్నాడు ఎస్ కే ఎన్. కానీ ఇదంతా ఎస్ కే ఎన్ ప్రొఫెషనల్ లైఫ్.

ఇకపోతే ట్విట్టర్లో చాలా యాక్టివ్ గా ఉంటాడు ఎస్ కే ఎన్. కొన్నిటికి చాలా ధీటుగా సమాధానం చెబుతుంటాడు. అవతల వాడికి మాట్లాడే ఛాన్స్ లేకుండా ఆన్సర్స్ చెప్పడం ఎస్ కే ఎన్ కి వెన్నతో పెట్టిన విద్య. స్టేజ్ పైన పంచులు ప్రాసలు వాడే ఎస్కేఎన్ ఎవరికైనా సమస్య ఉంది అని తెలిస్తే తన వంతు సాయాన్ని అందజేస్తాడు. రీసెంట్ టైమ్స్ లో ఎన్టీఆర్ అభిమాని హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా తన వంతుగా దాదాపు 50 వేలు వరకు హాస్పిటల్ ఖర్చులకు పంపించాడు. ఇలాంటి ఉదాహరణలు చెప్పడానికి ఎస్ కే ఎన్ జీవితంలో ఎన్నో ఉన్నాయి. అలానే తాను నిర్మించే సినిమాల్లో తెలుగు హీరోయిన్స్ కు కూడా ప్రాధాన్యత ఇస్తుంటాడు.

చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు

ఇకపోతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ అక్కడ భారీ ఘనవిజయం సాధించాడు. అయితే ఈ రిజల్ట్ కంటే ముందు పిఠాపురంలో ఒక వీడియో వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత నా భర్త రిక్షా తొక్కిన డబ్బులతో ఊరందరికీ పార్టీ ఇస్తాను అంటూ ఒక మహిళా చెప్పడం వైరల్ గా మారింది. ఆ వీడియోని చూసిన ఎస్ కే ఎన్ తమ భర్తకు ఒక ఆటో కొనిస్తాను అంటూ ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చాడు. చెప్పినట్లుగా ప్రస్తుతం అదే పనిలో ఉన్నాడు. అయితే ఆ మహిళ భర్తకు ఆటో తోలడం రాదని తెలిసిందంట, అయితే ఈ సాయాన్ని వేరే రకంగా ఎలా అందించాలి అని ఆలోచిస్తున్నాను అంటూ ట్విట్టర్ వేదికగా అప్పట్లో చెప్పుకొచ్చాడు. ఇక రీసెంట్ గా ఒక ఆటోనుకొని ఆ ఫ్యామిలీకి గిఫ్ట్ గా ఇచ్చాడు ఎస్ కే ఎన్ ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

- Advertisement -

Skn

ఇకపోతే ముందు ఒక మాట వెనక ఒక మాట చెప్పిన రాజకీయ నాయకులను చాలా మందిని చూసి ఉంటాం. పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా తీసుకొని ఇచ్చిన మాటలు నిలబెట్టుకొనే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ఎస్ కే ఎన్ ఉండటం పవన్ కళ్యాణ్ కు, పవన్ కళ్యాణ్ అభిమానులకు గర్వకారణం అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు