Skn: నేను పి ఆర్ పనిచేయడం ఆపేసాను, రాజా సాబ్ సినిమాలో నా పాత్ర

Skn: శ్రీనివాస కుమారన్ అంటే అందరికీ తెలియకపోవచ్చు. కానీ ఎస్ కే ఎన్ అంటే తెలియని వాళ్ళు ఉండరు అని చెప్పొచ్చు. ఎందుకంటే అంతగా ఈ మధ్య కాలంలో పాపులర్ అయ్యారు ఎస్ కే ఎన్. ఇంకా ఎస్ కే ఎన్ అని గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్ని సినిమాలు నిర్మించిన కూడా ఎస్ కే ఎన్ కి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చిన సినిమాలు అంటే టాక్సీవాలా అండ్ బేబీ అని చెప్పొచ్చు.

రీసెంట్ గా వచ్చిన బేబీ సినిమా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఒక సినిమాని నమ్మి కొన్ని కోట్లు పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఒక దర్శకుడి ఆలోచన నమ్మి కొన్ని కోట్లు పెట్టడం అంటే దానిని సాహసం అనే చెప్పాలి. అయితే అలా సాయి రాజేష్ ఆలోచనను నమ్మి కొన్ని కోట్లు పెట్టి బేబీ సినిమాను నిర్మించారు. ఈ బేబీ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ ను రాబట్టింది.

ముందుగా ఈ సినిమా విషయంలో కొంతమంది నుంచి కొద్దిపాటి నెగిటివ్ ఫీడ్ బ్యాక్స్ వచ్చాయి. కానీ అవన్నీ కూడా రియల్ ఆడియన్స్ నుంచి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ తో డామినేట్ అయిపోయాయి. ఇకపోతే ఈ సినిమా ప్రీమియర్ పడగానే కల్ట్ బ్లాక్ బస్టర్ కొట్టామని చాలా నమ్మకంతో అప్పట్లో చెప్పుకొచ్చారు ఎస్ కే ఎన్. అక్కడితో ఎస్ కే ఎన్ బాగా ఫేమస్ అవుతూ వచ్చారు. అంతకంటే ముందు నుంచే కూడా ఎస్ కే ఎన్ స్టేజ్ పైన మాట్లాడిన తీరు, ట్విట్టర్లో ఫ్యాన్స్ కి ఇచ్చే రిప్లైస్ కూడా ఎస్ కే ఎన్ కి ఒక ఓన్ ఇమేజ్ ను తీసుకొచ్చి పెట్టాయి. ఇకపోతే ఏ సినిమా ఫంక్షన్ అయినా కూడా ఎస్ కే ఎన్ తన మాటలతో అందరినీ ఆశ్చర్యపరుస్తాడు.

- Advertisement -

SKN

మీకు రీసెంట్ గా ట్విట్టర్ లో ఒక అభిమాని ప్రభాస్ కి మీరు పి.ఆర్ గా వర్క్ చేస్తే బాగుంటుంది అని చెప్పినప్పుడు. నేను పిఆర్ వర్క్ ఆపేసి చాలా రోజులు అవుతుంది నేను ఇప్పుడు పూర్తిస్థాయి నిర్మాతగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను అదృష్టవషత్తు మారుతి దర్శకత్వం వహిస్తున్న రాజా షాబ్ సినిమాకి క్రియేటివ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు ఎస్కేఎన్. ఇకపోతే మారుతి కి ఎస్ కే ఎన్ కి ఉన్న ఫ్రెండ్షిప్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు వీరిద్దరూ కలిసి దాదాపుగా జర్నీని మొదలుపెట్టి నేడు ఇండస్ట్రీలో తమకంటూ కొంత స్థానాన్ని సంపాదించుకున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు