Sobhita Dhulipala : అమ్మలా మారానన్న చిన్నారి శోభిత..! అంత ఈజీగా గుర్తుపట్టలేరుగా?

Sobhita Dhulipala : టాలీవుడ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగమ్మాయి అయిన ఈమె అడవిశేష్ గూఢచారి సినిమాతో ఆడియన్స్ కి సుపరిచితమైంది. అయితే ఆ తర్వాత కూడా తెలుగులో వరుస సినిమాలు చేయకుండా సెలెక్టీవ్ గా మెల్లిగా సినిమాలు చేస్తూ ఉంది. ఇదిలా ఉండగా శోభితా ధూళిపాళ ఈ మధ్య సినిమాల కన్నా యంగ్ హీరో నాగ చైతన్యతో ఎఫైర్ రూమర్లతో ఎక్కువ ఫేమస్ అయింది. సమంత తో నాగ చైతన్య విడిపోయినప్పటినుండి ఈ అమ్మాయితో రూమర్లు వస్తూనే ఉన్నాయి. ఇక చైతూ రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ గా ఎప్పుడూ ఏదో ఒక విషయంలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. ఇటీవల నాగ చైతన్యతో కలిసి సమ్మర్ ట్రిప్ కు వెళ్లినట్లు వార్తలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఇద్దరి ఇన్ స్టా స్టోరీలను కంపేర్ చేస్తూ చైతు, శోభిత కచ్చితంగా కలిసే వెళ్లారని ఫిక్స్ చేసేశారు నెటిజన్స్. ఇక తెలుగమ్మాయి అయినా బాలీవుడ్ మూవీ రామన్ రాఘవన్ 2.0 తో తొలిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి తన యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకుంది శోభిత. తెలుగులో గూఢచారి సినిమాతో హీరోయిన్‌ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

సోషల్ మీడియా లో ఫుల్ ఫేమస్..

ఇక శోభిత కేవలం బాలీవుడ్, టాలీవుడ్ కాకుండా.. మిగతా భాషల్లో కూడా సినిమాలు చేసింది. ఇటీవల మంకీ మ్యాన్ మూవీతో హాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చింది. స్ల‌మ్ డాగ్ మిలియ‌నీర్ ఫేమ్ దేవ్ ప‌టేల్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక అంతకు ముందే తమిళ్ లో మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ లో జయం రవి కి జోడిగా నటించిన విషయం తెలిసిందే. ఓవైపు వరుస సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే.. మరోవైపు సోషల్ మీడియాలో కూడా సందడి చేస్తుంటోంది శోభిత. డైలీ అప్డేట్స్ ఇస్తూ తన ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది. ఇదిలా ఉండగా నిన్న మదర్స్ డే సందర్భంగా స్పెషల్ పోస్ట్ పెట్టింది శోభిత. సింపుల్ గా చుడీదార్ వేసుకున్న శోభిత, తన తల్లి దగ్గర కూర్చుని పుస్తకం చదువుతున్న పిక్ ను షేర్ చేసింది. దాంతోపాటు చిన్నప్పటి ఫోటోను కూడా పోస్ట్ చేసింది.

Sobhita Dhulipala shared her childhood photo

- Advertisement -

చీరలో అమ్మ లా శోభిత..

ఇక శోభితా (Sobhita Dhulipala) తాజాగా పోస్ట్ చేసిన పిక్స్ లో చివర్లో తన చిన్నప్పటి ఫోటోను షేర్ చేసిన శోభిత, అందులో క్యూట్ గా చీర కట్టుకుని.. నవ్వుతూ కనిపించింది. చిన్నప్పుడు తన అమ్మలా కనిపించడానికి ట్రై చేసిన దిగిన పిక్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. బుల్లి శోభిత అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చిన్నప్పుడు ఎక్కడో షికారుకు వెళ్లిన పిక్ ను షేర్ చేయగా.. త్రో బ్యాక్ మెమోరీస్.. నైస్ శోభిత అని సందడి చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అందాలు ఆరబోస్తుంటోంది శోభితా ధూళిపాళ్ల. పొట్టి డ్రెస్సుల్లో హీట్ పుట్టించేలా పోజులు ఇస్తుంటోంది. ఓ రేంజ్ లో స్కిన్ షో చేస్తూ ఆకట్టుకుంటోంది అమ్మడు. రకరకాల క్రేజీ అవుట్ ఫిట్స్ లో కిర్రాక్ లుక్స్ పోస్ట్ చేస్తుంటోంది. ఇండస్ట్రీలో కూడా వరుస అవకాశాలు దక్కించుకుని దూసుకుపోతోంది. ప్రస్తుతం హిందీలో సితార అనే సినిమాలో నటిస్తుంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు