Sobhita – Naga Chaitanya: ఈ జంట తల్లిదండ్రులు కాలేరంటూ బాంబు పేల్చిన వేణు స్వామి..!

Sobhita – Naga Chaitanya. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నాగచైతన్య గురించి పరిచయం అవసరం లేదు. గతంలో ఏమాయ చేసావే సినిమాలో హీరోయిన్ గా నటించిన సమంతాను ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్న వీరు, వైవాహిక జీవితంలో ఎక్కువకాలం నిలవలేకపోయారు. పెళ్లి జరిగిన నాలుగేళ్లకే విడాకులు తీసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది ఈ జంట. అంతేకాదు వీరిద్దరూ విడాకులు తీసుకున్న సమయంలో సమంతను చాలామంది విమర్శించారు కూడా. దీనికి తోడు నాగచైతన్య కూడా సమంత పై వచ్చిన విమర్శలను ఖండించే ప్రయత్నం చేయలేదు.

Sobhita - Naga Chaitanya: Venu Swamy who blasted the couple saying that they are not parents..!
Sobhita – Naga Chaitanya: Venu Swamy who blasted the couple saying that they are not parents..!

శోభితతో నిశ్చితార్థం..

ఇదిలా వుండగా.. మరొకవైపు ఈయన ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ప్రేమాయణం నడిపారు. అయితే ఈ విషయంపై మీడియా ప్రశ్నించినా సరే వీరు మాత్రం నోరు మెదపలేదు. అయితే అందరూ ఊహించినట్టే.. ఆగస్టు 8వ తేదీన శోభిత, నాగచైతన్య నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని నాగచైతన్య తండ్రి ప్రముఖ సీనియర్ హీరో నాగార్జున అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తూ ఫోటోలు కూడా షేర్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న నేపథ్యంలో ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి వీరి వివాహం కూడా ఎక్కువ కాలం నిలవదని , పెళ్లయిన మూడోళ్ళకే అంటే 2027లోనే వీరు విడాకులు తీసుకుంటారు అంటూ హాట్ బాంబు పేల్చారు. దీంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

నాగ చైతన్య – శోభిత తల్లితండ్రులు కాలేరు..

ఎందుకంటే గతంలో సమంత – నాగ చైతన్య విడిపోతారు అంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచిన వేణు స్వామి ఆయన చెప్పినట్టుగానే వారు విడిపోయారు. అయితే ఇప్పుడు మళ్ళీ నాగచైతన్య, శోభిత జంట కూడా విడిపోతారని చెప్పారు. దీంతో అభిమానులు ఈ షాక్ నుండీ బయట పడక ముందే.. ఈ జంట ఎప్పటికీ తల్లిదండ్రులు కాలేరు అంటూ మరో హాట్ బాంబు పేల్చారు వేణు స్వామి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

నాగ చైతన్య కి తండ్రి అయ్యే యోగ్యం లేదు..

తాజాగా మరో వీడియో షేర్ చేసిన వేణు స్వామి అందులో మాట్లాడుతూ.. నాగచైతన్యకు జాతకరీత్యా తండ్రి స్థానం ఆయనకు బలంగా లేదు. కానీ అది తన తండ్రి స్థానం కూడా అయి ఉండ వచ్చు. లేకపోతే నాగ చైతన్య తండ్రిగా మారడం అయినా అయి ఉండవచ్చు. ముఖ్యంగా పెంపకం విషయంలో ఇబ్బందులు అయినా వుండవచ్చు. వివాహం తదుపరి నాగచైతన్య జాతకంలో తండ్రి అయ్యే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయనకు తండ్రి అయ్యే భాగ్యం లేదు .ఎందుకంటే ఆయన జాతక బలం అలాంటిది అంటూ సంచలనం కమెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది. శోభిత – నాగచైతన్య విడిపోతారని విడిపోయిన తర్వాత జాతకాలు కూడా ఏమంత బాగా లేవని కెరియర్ పతనం అవుతుందని , ఇప్పుడు పిల్లలు కూడా కలగరుఅని.. తల్లిదండ్రులు కాలేరు అంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు వేణు స్వామి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు