Sobhita: చైతూ కంటే ముందే అతనితో ఎఫైర్ నడిపిన శోభిత.. కట్ చేస్తే..!

Sobhita.. గత కొన్ని నెలలుగా అందరూ అనుకున్నట్లుగానే, మీడియా చెప్పిందే నిజమైంది అని చెప్పవచ్చు. నాగచైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థం చేసుకుని ఒక్కటయ్యారు. ఈ నేపథ్యంలోనే శోభితాకు సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈమె నాగచైతన్యను ప్రేమించక ముందే ఇంకొక అబ్బాయి తో ఎఫైర్ పెట్టుకుందని, అయితే కొన్ని కారణాలవల్ల అతడి నుంచి దూరమైందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Sobhita: Sobhita who had an affair with him before Chaitu.. if cut..!
Sobhita: Sobhita who had an affair with him before Chaitu.. if cut..!

నాగచైతన్య తో ఎంగేజ్మెంట్..

అసలు విషయంలోకి వెళ్తే నాగచైతన్య, సమంత నుంచి విడిపోయిన తర్వాత దాదాపు మూడేళ్ల పాటు సినీ కెరియర్ పైన దృష్టి సారించారు. అయితే అదే సమయంలో మరొకవైపు ప్రముఖ హీరోయిన్ శోభిత తో కూడా ఎఫైర్ నడిపించాడని వార్తలు వినిపించాయి. అంతేకాదు ఇద్దరూ కలిసి వెకేషన్స్ కి వెళ్లడం లాంటివి చేశారు. అయితే ఎక్కడ కూడా బయటపడకుండా చక్కగా ప్లాన్ చేశారు. కానీ మీడియాకు అప్పుడప్పుడు దొరికిపోయారని చెప్పాలి. ఇక ఎట్టకేలకు నిన్న అనగా ఆగస్టు 8న నాగ చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. వీరిద్దరితో కలిసి దిగిన ఫోటోని నాగార్జున పంచుకున్నారు కూడా.. ఇవాళ ఉదయమే నిశ్చితార్థం జరిగింది అంటూ ఆగస్టు 8 గురువారం ఉదయం 9:42 నిమిషాలకు ఈ వేడుక జరిగినట్లు ఫోటోలను పంచుకుంటూ ఈ విషయాన్ని తెలియజేశారు నాగార్జున.

చైతూ కంటే ముందే అతడితో ఎఫైర్ పెట్టుకున్న శోభిత.

ఇకపోతే నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ అనగానే ఈమె ఎవరు? అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఏం చదువుకుంది? ఎవరైనా ముందుగా ఈమెకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా ? అంటూ రకరకాలుగా ఈమె గురించిన విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు ఆరా తీస్తున్నారు. అందులో భాగంగానే ఈమె గురించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

- Advertisement -

ఫ్యాషన్ డిజైనర్ తో శోభిత ఎఫైర్..

శోభిత బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి. విశాఖపట్నంలో లిటిల్ ఏంజెల్ స్కూల్ , విశాఖ వ్యాలీ స్కూల్లో స్కూల్ విద్యాభ్యాసం పూర్తి చేసింది. హెచ్ఆర్ కాలేజీలో కామర్స్ ఎకనామిక్స్ పూర్తి చేసిన శోభిత సాంప్రదాయ నృత్యాలు అయిన కూచిపూడి, భరతనాట్యం కూడా నేర్చుకుంది. ఇకపోతే ఈమె నాగచైతన్యను ప్రేమించక ముందే ఫ్యాషన్ డిజైనర్, లగ్జరీ బ్రాండ్ హ్యూమన్ సహ వ్యవస్థాపకుడు ప్రణవ్ మిశ్రా తో ఎఫైర్ నడిపింది. 2019లో ఒక ఫ్యాషన్ ఈవెంట్లో వీళ్ళిద్దరూ కలుసుకున్నారట .చాలా రోజులు తమ బంధాన్ని కొనసాగించారట. కానీ కొన్ని కారణాలవల్ల వీరిద్దరూ విడిపోయినట్లు సమాచారం.

పెద్దింటి కోడలు కాబోతున్న శోభిత..

మొత్తానికి అయితే శోభిత అక్కడ తన ప్రియుడి నుంచి విడిపోయిన తర్వాత ఇప్పుడు పెద్ద కుటుంబానికి కోడలు కాబోతోందని తెలుస్తోంది. మరొకవైపు నాగచైతన్య మాజీ భార్య ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత మాత్రం వీరిద్దరి ఎంగేజ్మెంట్ పై స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే అప్పుడు సమంతను తిట్టిన చాలామంది ఇప్పుడు ఆమెను పొగుడుతూ నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ పై రకరకాల కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరి ఈ విషయంపై అక్కినేని కుటుంబీకులు ఏదైనా స్పందిస్తారేమో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు