Devara : ఓవర్సీస్ లో ‘దేవర’ ప్రభంజనం.. మూడు వారాల ముందే రికార్డ్…

Devara : జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ (Koratala shiva) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ “దేవర” రిలీజ్ డేట్ దగ్గరవుతున్న కొద్దీ అంచనాలు విపరీతంగా పెంచేస్తుంది. నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ (JR NTR) ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం రివీల్ అయ్యాక మరింతగా హైప్ పెరిగింది. ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ సినిమాపై అంచనాలని స్కై లెవెల్లో పెంచేయగా, విడుదలైన మూడు పాటలు కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. పాటలు వచ్చినపుడు కాస్త ట్రోల్ అయినా, వింటున్న కొద్దీ చార్ట్ బస్టర్స్ గా నిలుస్తున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా మొత్తం పూర్తయిపోగా, చిత్ర యూనిట్ కూస్తో ప్రమోషన్లలో వేగం పెంచింది. తాజాగా దావుడి (Davudi) పేరుతో మూడో సాంగ్ రిలీజ్ కాగా, క్రేజీ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

Solid bookings for Devara movie in overseas

ఓవర్సీస్ లో దేవర ప్రభంజనం…

ఇదిలా ఉండగా దేవర (Devara) సినిమాకి ఇంకా మూడు వారాల సమయం ఉండగా, ఓవర్సీస్ లో వారం కిందే బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. అయితే ఓవర్సీస్ లో బుకింగ్స్ స్టార్ట్ చేసి వారం రోజులు గడవకుండానే అక్కడ ఏకంగా 500k డాలర్ల మార్క్ అందుకోవడం విశేషం. నిన్నటితో 460k మార్క్ క్రాస్ చేయగా, తాజాగా 500k అందుకుంది. ఈ స్పీడ్ చూస్తుంటే ఓవర్సీస్ లో రికార్డుల జాతర ఖాయమని తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఫస్ట్ డేనే దేవర 3 మిలియన్ డాలర్ల ఓపెనింగ్స్ అందుకుంటుందని విశ్లేషకులు అంటున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా రిలీజ్ టైం నాటికి బుకింగ్స్ లో కొత్త రికార్డ్స్ క్రియేట్ అవుతాయని అంటున్నారు నెటిజన్లు. ఇటు మేకర్స్ కూడా దేవరకు వరల్డ్ వైడ్ గా తొలిరోజే వంద కోట్ల ఓపెనింగ్స్ వస్తాయని ఆశిస్తున్నారు.

- Advertisement -

అతి త్వరలోనే ట్రైలర్..

ఇక చిత్ర యూనిట్ కూడా మూడో సాంగ్ రిలీజ్ చేసి ప్రమోషన్లలో వేగం పెంచింది. ఇతర భాషల్లో ఉన్న సినిమాల పోటీ దృష్ట్యా దేవరకి సాలిడ్ ఓపెనింగ్స్ రావాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల సంగతి పక్కనబెడితే, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గట్టి ప్రమోషన్లు కావాల్సి ఉంటుంది. దానికి ట్రైలర్ తోనే ముహూర్తం పెట్టనున్నారు. అతి త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్ (Devara Trailer) ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ అనౌన్స్ చేసారు. ఇక వచ్చే వారం దేవర ట్రైలర్ ని రిలీజ్ చేసి ముంబై నుండే దేవర ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేయనున్నారు. దాదాపు యాభైకి పైగా మేకర్స్ ఇంటర్వ్యూ లు ప్లాన్ చేసారని సమాచారం. మరి వెయ్యి కోట్ల పొటెన్షియల్ ఉందని ప్రచారం నడుస్తున్న దేవరకి ఏ రేంజ్ ఓపెనింగ్స్ వస్తాయో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు