SaripodhaaSanivaaram : క్లాస్ థియేటర్స్ లో నాని మాస్ జోరు..

Saripodhaa Sanivaaram : నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం సినిమా ఫైనల్ గా రేపు అనగా ఆగష్టు 29న థియేటర్లలో రిలీజ్ అయిపోతుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. సినిమా టీజర్, ట్రైలర్ సహా తమ ప్రమోషన్లతో సినిమాపై భారీగా అంచనాలను పెంచేయగా, సరిపోదా శనివారం సినిమా బుకింగ్స్ లో మాస్ జోరు చూపిస్తుంది. ఇక కల్కి తర్వాత వచ్చిన మినిమం అంచనాలతో వచ్చిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. రెండు చిన్న సినిమాలు తప్ప అన్ని క్రేజీ సినిమాలు ఫెయిల్ కావడంతో ఇప్పుడు మూవీ లవర్స్ కూడా మాంచి ఆకలిమీదున్నారు. అందుకే అందరి కళ్ళు ఇప్పుడు సరిపోదా శనివారం సినిమాపై పడ్డాయి.

Solid bookings for Saripodhaa Sanivaaram at multiplexes

క్లాస్ సెంటర్స్ లో నాని మాస్ జోరు..

ఇక సరిపోదా శనివారం బుకింగ్స్ వారం ముందునుండే అందుబాటులోకి వచ్చేయగా, ఓవర్సీస్ సహా నాని అన్ని చోట్ల తన మాస్ జోరు చూపిస్తున్నాడు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో మల్టిప్లెక్స్ థియేటర్లలో, ఏ సెంటర్లలో ఈ సినిమా సాలిడ్ బుకింగ్స్ నమోదు చేస్తుంది. క్లాస్ ఆడియన్స్ లో నానికి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు సరిపోదా శనివారం సినిమా మాస్ సెంటర్లతో సమానంగా క్లాస్ థియేటర్లలో బుకింగ్స్ నమోదు చేస్తుండడం విశేషం. ట్రాక్ చేసిన సెంటర్లను బట్టి తెలుగు రాష్ట్రాల్లోనే పది కోట్ల ఓపెనింగ్స్ రావడం ఫిక్స్ అయిపొయింది. ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే మీడియం రేంజ్ స్టార్ హీరోల్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయమంటున్నారు నెటిజన్లు.

- Advertisement -

కెరీర్ బెస్ట్ కొడతాడా?

ఇక సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) సినిమా ఓవర్సీస్ లో ఇప్పటికే 300k డాలర్ల మార్క్ క్రాస్ చేయగా, తొలి రోజు ఓవర్సీస్ లో ఆరు లక్షల డాలర్ల ఓపెనింగ్స్ అందుకునే ఛాన్స్ కనిపిస్తుంది. సరిపోదా శనివారం సినిమాతో నాని మళ్ళీ తన కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అందుకునే ఛాన్స్ కనిపిస్తుంది. కంటెంట్ క్లిక్ అయితే ఈ సారి వంద కోట్ల షేర్ ని సైతం సరిపోదా శనివారం అందుకునే ఛాన్స్ ఉంది. ఇక పాన్ ఇండియా భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమా ఇతర భాషల్లో ఆశించిన బుకింగ్స్ సొంతం చేసుకోకపోయినా, రిలీజ్ తర్వాత జోరు చూపించే ఛాన్స్ ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు