Swag : శ్రీవిష్ణు సినిమాకి సాలిడ్ రేటు.. సక్సెస్ లో ఉంటే ఇలా ఉంటది!

Swag : టాలీవుడ్ టాలెంటెడ్ హీరోలలో ఒకరైన శ్రీ విష్ణు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. గత కొన్నాళ్లగా సరైన హిట్ లేక సతమతమైన శ్రీ విష్ణు ఇప్పుడు వరుస విజయాలతో గాడిలో పడ్డాడు. టాలీవుడ్ లో టాలెంట్ ని నమ్ముకుని వచ్చిన హీరోల్లో శ్రీ విష్ణు ఒకడు కాగా, శ్రీ విష్ణు స్క్రిప్ట్ సెలక్షన్ కూడా అద్భుతంగా ఉంటుంది. పెద్దగా హీరోయిజం ఉన్న కథల వైపు వెళ్లకుండా తనకు సెట్ అయ్యే కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. అలాగే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసే హీరోలలో కూడా శ్రీ విష్ణు ఒకడు. ఇక శ్రీ విష్ణు లాస్ట్ ఇయర్ సామజవరగమన సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకోగా, ఈ ఇయర్ వస్తూనే “ఓం బీమ్ బుష్” సినిమాతో మరో సూపర్ హిట్ కొట్టేసాడు. కామెడీ హారర్ గా తెరకెక్కిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు తన తదుపరి చిత్రం “స్వాగ్” (Swag) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

Solid business for Sree Vishnu starrer Swag Movie

స్వాగ్ కి తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రేటు..

ఇక శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న స్వాగ్ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ బిజినెస్ జరుగుతుందట. రెండేళ్ల కింద వరుస పరాజయాలతో సతమతమైన శ్రీ విష్ణు తరవాత ట్రాక్ మార్చాడు. ఇక లాస్ట్ ఇయర్ సామజవరగమన సినిమా బ్లాక్ బస్టర్ కొట్టగా, ఈ ఇయర్ ఓం భీం బుష్ తో వరుసగా రెండు హిట్లు కొట్టేసరికి, రాబోయే స్వాగ్ సినిమాకి సాలిడ్ రేటు వచ్చింది. ఇక స్వాగ్ సినిమాకి తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, తమిళనాడు ఏరియా థియేటర్ హక్కులు కలిపి ఏకంగా 9 కోట్లకు సింగిల్ పాయింట్ లో అమ్ముడుపోయిందని సమాచారం. ఇది శ్రీ విష్ణు కెరీర్ లో రికార్డ్ అని చెప్పాలి. ఇంతకు ముందు ఓం భీం బుష్ సినిమాకి వరల్డ్ వైడ్ గా 9 కోట్ల బిజినెస్ జరగగా, శ్రీ విష్ణు కెరీర్ లో అదే హైయెస్ట్ రేటు. ఇప్పుడు స్వాగ్ సినిమా దాన్ని బ్రేక్ చేస్తుందనిపిస్తుంది. ఇక వరుస సక్సెస్ లో ఉండడం వల్ల శ్రీ విష్ణు సినిమాకి ఈ రేంజ్ వచ్చిందని చెప్పాలి.

- Advertisement -

స్వాగ్ కోసం శ్రీ విష్ణు మేకోవర్…

ఇక శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి హసిత్ గోలి డైరెక్షన్ వహింస్తున్నాడు. కాగా రీతు వర్మ హీరోయిన్ గా నటింస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా మంచి రెస్సాన్స్ తెచ్చుకుంది. ఇక ఈ మూవీలో యంగ్ బ్యూటీ దక్ష, మీరా జాస్మిన్, శరణ్య ప్రదీప్ కీలకపాత్రలు నటించారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం సమకూరాస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ చిత్రాన్ని గ్రాండ్ గా టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో శ్రీవిష్ణు భవభూతి పాత్రలో పరిచయం చేయబడి, స్త్రీవాదిగా చిత్రీకరించబడ్డాడు. ఇందులో ద్విపాత్రాభినయం చేయనున్నాడు శ్రీ విష్ణు. ఇక ఈ సినిమా కోసం శ్రీ విష్ణు చాలా కష్టపడ్డాడని తెలుస్తుంది. శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న స్వాగ్ సినిమాకి సంబంధించి ఆ మధ్య ఓ మేకింగ్ వీడియో ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక స్వాగ్ సినిమాని జులై మూడో వారం లో లేదా ఆగష్టు లో సోలో రిలీజ్ డేట్ ని చూసుకుని రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్.

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు