Manamey : సాలిడ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ చేసిన శర్వా మూవీ!

Manamey : టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ కాబోతున్న క్రేజీ సినిమాల్లో శర్వానంద్ నటించిన “మనమే” సినిమా కూడా ఒకటి. లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర శర్వానంద్ నటించిన ప్రీవియస్ మూవీస్ లో “ఒకే ఒక జీవితం ఆడియన్స్ అంచనాలను అందుకుని మంచి విజయాన్ని సొంతం చేసుకోగా, ఆ సినిమా తర్వాత ఆల్ మోస్ట్ రెండేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ మనమే (Manamey) మూవీ ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. ఇక ఈ సినిమా కోసం మొదటి నుండి చాలా జాగ్రత్తలు తీసుకున్న శర్వానంద్ లిమిటెడ్ బడ్జెట్ లోనే సినిమా పూర్తి అయ్యేలా చూసుకున్నాడని సమాచారం. ఇక ఆల్ మోస్ట్ 30 కోట్ల రేంజ్ బడ్జెట్ లో ఈ సినిమా నిర్మాణం కంప్లీట్ అవ్వగా, ఇప్పుడు బిజినెస్ పరంగా కూడా మంచి జోరుని చూపిస్తున్న ఈ సినిమా రిలీజ్ కి ముందే నాన్ థియేట్రికల్ బిజినెస్ మొత్తం కంప్లీట్ అయ్యిందని సమాచారం.

Solid non-theatrical business for Sharwanand's 'Maname'

కళ్ళు చెదిరే బిజినెస్ చేసిన మనమే..

ఇక నం థియేట్రికల్ రైట్స్ కింద మనమే సినిమా సాలిడ్ బిజినెస్ చేసిందని తెలుస్తుంది. ఫిల్మీఫై కి అందిన సమాచారం ప్రకారం మనమే సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ అలాగే డబ్బింగ్ రైట్స్ తో కలిపి ఓవరాల్ గా 27.50 కోట్ల రేంజ్ లో రేటుని సొంతం చేసుకుందని సమాచారం. అంటే పెట్టిన బడ్జెట్ 30 కోట్లలో ఆల్ మోస్ట్ 27.50 కోట్ల రికవరీ నాన్ థియేట్రికల్ బిజినెస్ ను సొంతం చేసుకోగా మిగిలిన మొత్తం ఇప్పుడు థియేట్రికల్ బిజినెస్ ద్వారా రాబోతుంది అని చెప్పాలి. ఇక మేకర్స్ కి మంచి టేబుల్ ప్రాఫిట్ ఈ సినిమాతో సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక మనమే కి చిన్న సినిమాకి అయినంత థియేట్రికల్ బిజినెస్ అయినా చాలు నిర్మాత భారీ లాభాలు చూసే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాతో శర్వానంద్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి.

- Advertisement -

ఫ్యామిలీ& లవ్ ఎంటర్టైనర్ గా మనమే..

ఇక మనమే సినిమాను శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వం వహించగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టిజి విశ్వా ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు. హేశం అబ్దుల్లా వాహబ్ మ్యూజిక్ అందించారు. ఇక ఈ సినిమాలో శర్వానంద్, కృతి శెట్టి హీరో, హీరోయిన్లుగా నటించగా రాహుల్ రామకృష్ణ, తనికెళ్ళ భరణి, సీరత్ కపూర్, రాహుల్ రవీంద్రన్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, గాని ట్రైలర్ గాని ఇప్పటికే మంచి అంచనాలు పెంచేయగా, సాంగ్స్ ఆల్రెడీ సూపర్ హిట్ అయ్యాయి. ఇక రేపు హైదరాబాద్ లో మనమే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహిస్తుండగా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రానున్నారని సమాచారం. ఇక ఈ సినిమాతో శర్వానంద్ బ్లాక్ బస్టర్ కొట్టాలని ఎదురుచూస్తున్నాడు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు