Somy Ali- సిగరెట్స్ తో కాల్చే వాడు

బాలీవుడ్ లో 56 ఏళ్ల వయసు వచ్చిన ఇంకా పెళ్లీ పీటలెక్కని హీరో సల్మాన్ ఖాన్. అంత వయసులో కూడా ఈయన వరుసగా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ ముందు బెస్ట్ హీరోగా రాణిస్తున్నాడు. సల్మాన్ ఖాన్ కు పెళ్లి కాలేకోపోయినా, చాలా మంది హీరోయిన్స్ తో ఎఫైర్ నడిపించాడని ఓపెన్ టాక్ ఉంది. అందులో బాలీవుడ్ హీరోయిన్ సోమీ అలీతో సల్మాన్ ఖాన్ చాలా రోజుల పాటు ప్రేమాయణం సాగించాడని అందరికీ తెలుసు. వీరిద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించారు. దీంతో వీరి మధ్య స్నేహం ఏర్పడింది. తర్వాత అది ప్రేమగా మారింది. డేటింగ్ లో కూడా ఉన్నారు.

అయితే అభిప్రాయభేదాలతో ఈ ఇద్దరు వీడిపోయారు. బ్రేకప్ అయిన నాటి నుంచి సల్మాన్ ఖాన్ పై సోమీ అలీ అనేక సార్లు సంచలన ఆరోపణలు చేసింది. తాజా గా మరోసారి సల్మాన్ ఖాన్ ను టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేసింది. మహిళల పట్ల సల్మాన్ ఖాన్ ప్రవర్తన బాగుండదని ఆరోపించింది. అమాయకమైన మహిళలను టార్గెట్ చేస్తూ లైంగికంగా వేధించేవాడని తెలిపింది.

అలాగే సల్మాన్ అమ్మాయిలను సిగరెట్స్ తో కాల్చేవాడని, అతను ఒక పిరికి పంద అని, ఉమెన్ బీటర్ అని ఆరోపించింది. అంతే కాదు.. మహిళలను శారీరకంగా వేధించడం ఆయన నైజం అంటూ చెప్పుకొచ్చింది. కాగా 46 ఏళ్ల వయసు ఉన్న పాకిస్థానీ నటి సోమీ అలీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. సల్మాన్-సోమీ 1993 నుంచి 99 వరకు డేటింగ్ లో ఉండేవాళ్లు. అప్పుడు ఈ జంట పెళ్లితో ఒక్కటి అవుతుందని అనుకున్నారు. కానీ వీడిపోయారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు