sonakshi sinha: హీరోయిన్‌ చెప్పులు మోసిన భర్త !

Sonakshi Sinha: బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని అన్వేషించడంలో సోనాక్షి సిన్హా ముందు వరుసలో ఉంటారు. ఈ బ్యూటీ ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు ముందు వరుసలో ఉంటూ అప్డేట్ గా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఈ బ్యూటీ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటూ తన అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. ఎన్నో చిత్రాల్లో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈ బ్యూటీ ఇటీవలే తన ప్రియుడుతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది.

నటుడు జహీర్ ఇక్బాల్ తో కలిసి ఈ బ్యూటీ ఏడడుగులు వేసింది. వీరిది ప్రేమ వివాహం. గత ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ కుటుంబసభ్యులను ఒప్పించి జూన్ 23న పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అలా వివాహమైన ఈ జంట కొన్ని రోజులకే ముంబైలోని కోకిల బెన్ ఆస్పత్రిలో తన భర్త జహీర్తో కలిసి బయటకు వచ్చే సమయంలో కనిపించింది. దీంతో సోనాక్షి ప్రెగ్నెంట్ అంటూ నెట్టింట్లో రూమర్స్ మొదలయ్యాయి. అవి కాస్త సోషల్ మీడియాను, సినీ ఇండస్ట్రీని షేక్ చేశాయి. ఇక వీరి ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులను చెప్పే సమయంలో సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా వీరి వివాహానికి ఒప్పుకోలేదు అంటూ ఎన్నో పుకార్లు వచ్చాయి. అయితే ఈ వార్తలను శత్రుఘ్న సిన్హా కాదని కొట్టి పారేశారు.

తన కూతురు పెళ్లిలో చాలా ఆనందంగా, చురుగ్గా అతను పాల్గొన్నారు. ఇక వీరి వివాహమైన రెండు రోజులకే శత్రుఘ్న సిన్హా ఆస్పత్రిలో చేరడం చాలా బాధాకరం. ఇక శత్రుఘ్న సిన్హా ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీయగా….తాను కాస్త అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరాడని వార్తలు వచ్చాయి. ఇదంతా పక్కకు పెడితే మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ జంట తాజాగా ఓ షాపింగ్ మాల్ లో కలిసి సందడి చేశారు. ఆ షాపింగ్ మాల్ లో తన భార్య చెప్పులను జహీర్ చేతులో పట్టుకొని కనిపించారు.

- Advertisement -

Sonakshi Sinha calls Zaheer Iqbal the 'greenest flag ever,' look at cute post

అతను ఆ చెప్పులను పట్టుకుని ముందుకు నడుచుకుంటూ వెళుతున్నపుడు సోనాక్షి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా మీకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకుంటే ఇలాగే సంతోషంగా ఉండవచ్చు అని రాసుకోచ్చారు. కాగా వీరి మతాలు వేరు కావడంతో వీరి వివాహాన్ని నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత కాలంలో మతాల గురించి ఎవరూ పట్టించుకోకుండా వివాహం చేసుకొని చాలా సంతోషంగా ఉంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు