Sonakshi – Zaheer Wedding : సోనాక్షి పెళ్లికి హాజరైన సౌత్ స్టార్స్ వీళ్లే

Sonakshi – Zaheer Wedding : బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ ఇప్పుడు భార్యాభర్తలు. ముంబైలో ఒకప్పటి హీరో, ప్రస్తుత ఎంపీ, సోనాక్షి సిన్హా తండ్రి శత్రుజ్ఞ సిన్హా ఇంట్లోనే ఈ జంట రిజిస్టర్డ్ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహానికి ఇరు కుటుంబాలు, పరిశ్రమకు చెందిన కొందరు స్నేహితులు హాజరయ్యారు. ఇంట్లో రిజిస్టర్ మ్యారేజ్ అయ్యాక సినిమా సెలబ్రిటీల కోసం ప్రత్యేకంగా రిసెప్షన్ పార్టీ ఇచ్చారు. సోనాక్షి, జహీర్ రిసెప్షన్ ముంబైలో గ్రాండ్ గా జరగ్గా, ఈ రిసెప్షన్ పార్టీకి వెయ్యి మందికి పైగా అతిథులు హాజరయ్యారు. అయితే పార్టీలో ఎక్కువగా బాలీవుడ్ ప్రముఖులే కన్పించినప్పటికి, సౌత్ స్టార్స్ కూడా సందడి చేశారు. మరి సోనాక్షి వెడ్డింగ్ రిసెప్షన్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన సౌత్ స్టార్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

సోనాక్షి పెళ్ళిలో సౌత్ స్టార్స్

కొత్త దంపతులు సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ వారి రిసెప్షన్‌లో చాలా అందంగా కనిపించారు. రిసెప్షన్ కోసం సోనాక్షి ఎరుపు రంగు చీరను ధరించింది. దానికి సెట్ అయ్యే నెక్లెస్, చెవిపోగులతో అందంగా ముస్తాబయ్యింది. హీర్ తెల్లటి షేర్వానీ ధరించాడు. సోనాక్షి సిన్హా, జహీర్ చేతులు పట్టుకుని రిసెప్షన్ వేదికలోకి ప్రవేశించారు. ఇక తరువాత ఒక్కొక్కరుగా పలువురు సెలబ్రిటీలు నవ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. అందులో సౌత్ హీరోహీరోయిన్లు కూడా ఉండడం విశేషం.

సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరైన ప్రముఖుల్లో పలువురు సౌత్ స్టార్స్ ఉన్నారు. తెలుగు, తమిళంతో పాటు హిందీ ప్రేక్షకులకు సైతం ఎంతో సుపరిచితుడైన కథానాయకుడు, హైదరాబాదీ అమ్మాయి - హీరోయిన్ అదితి రావు హైదరి జంటగా సందడి చేశారు. 

- Advertisement -

ఈ వేడుకకు కేవలం వెయ్యి మందికి మాత్రమే ఆహ్వానం అందినట్టుగా తెలుస్తోంది. పెళ్లి తర్వాత సోనాక్షి సిన్హా జహీర్ ఇక్బాల్ మీడియా ముందుకు కలిసి వచ్చారు. కానీ వారిద్దరూ సోలోగా ఫోజులు ఇవ్వడానికి ఒప్పుకోలేదని ప్రచారం జరుగుతుంది. ఇక ఈ వేడుకకు సౌత్ నుంచి ఆహ్వానం అందుకున్న స్టార్స్ లో సిద్ధార్థ ఉన్నాడు. సిద్ధార్థ తనకు కాబోయే భార్య, హీరోయిన్ అదితి రావు హైదరితో వేడుకలో సందడి చేశారు. ఒకప్పటి హీరోయిన్ రేఖ కాళ్ళు తాకుతూ సిద్ధార్థ్ ఆశీర్వాదాలు తీసుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోనాక్షి పెళ్లి వేడుకల్లో అదితి, సిద్ధార్థ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఇక నార్త్ నుంచి వచ్చి సౌత్ లో హీరోయిన్ గా ఎదిగిన ప్రగ్యా జైస్వాల్ కూడా సోనాక్షి సిన్హా రిసెప్షన్ కి హాజరైంది. ఈ బ్యూటీ బ్లాక్ కలర్ డ్రెస్ లో మెరిసింది. వీరితో పాటు హైదరాబాద్ బ్యూటీ టబు కూడా కనిపించింది.

ఉత్తరాది అమ్మాయి అయినా సరే... కథానాయికగా ప్రగ్యా జైస్వాల్ ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే. బ్లాక్ డ్రస్ ధరించి గ్లామర్ తళుకులతో సోనాక్షి సిన్హా రిసెప్షన్ కు హాజరైంది.

ఈ పార్టీలో పాల్గొన్న బాలీవుడ్ ప్రముఖులు

సోనాక్షి, జహీర్ రిసెప్షన్‌కు భాయిజాన్ సల్మాన్ ఖాన్ హాజరయ్యారు. భారీ సెక్యూరిటీ మధ్య అక్కడకు చేరుకున్న సల్మాన్ కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలిపి, కనీసం ఫోటోలకు కూడా ఫోజులు ఇవ్వకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. రిసెప్షన్‌కు రవీనా టాండన్, కాజోల్, అనిల్ కపూర్, చుంకీ పాండే, ఆదిత్య రాయ్ కపూర్ హాజరయ్యారు. వీరితో పాటే విద్యాబాలన్ ఆమె భర్త సిద్ధార్థ్ రాయ్ కపూర్ తో సందడి చేశారు. నాక్షి మరియు జహీర్ రిసెప్షన్‌కు కూడా హాజరయ్యారు. రిచా చద్దా, అలీ ఫజల్ జంట, షర్మీన్ సెగల్ తన భర్త అమన్ మెహతాతో కలిసి సోనాక్షి, జహీర్ రిసెప్షన్ వద్దకు వచ్చారు. అర్బాజ్ అతని మేనకోడలు అలీజ్, సంగీతా బిజ్లానీ, ఎవర్‌గ్రీన్ నటి రేఖ, హ్యూమా ఖురేషి, సంజీదా షేక్ రాపర్ హనీ సింగ్, సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షేరా తన కొడుకుతో కలిసి వచ్చారు.

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు