Sonali Bendre Comments : నిర్మాతలే అలాంటి రూమర్స్ క్రియేట్ చేసే వాళ్లు… ఎఫైర్స్‌పై సోనాలి బింద్రే

Sonali Bendre Comments : సినిమా ఇండస్ట్రీలో రూమర్స్ రావడం చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది. అందులోనూ హీరో – హీరోయిన్ల మధ్య ఎఫైర్స్ అంటూ వచ్చే వార్తలకు అయితే కొదువ లేదు. ఇప్పుడు కూడా ఇలాంటి వార్తలు వింటూనే ఉంటాం. అయితే తాజాగా ఇలాంటి న్యూస్ పై సీనియర్ హీరోయిన్ సోనాలి బింద్రే సంచలన వ్యాఖ్యలు చేసింది.

సీనియర్ హీరోయిన్ సోనాలి బింద్రే చాలా రోజుల గ్యాప్ తర్వాత ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. సినిమాలు వెబ్ సిరీస్‌లతో పాటు కొన్ని టీవీ షోలల్లో సోనాలి అప్పుడప్పుడు కనిపిస్తుంది. తాజాగా ది బ్రోకెన్ న్యూస్ 2 లో నటించింది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా హీరో – హీరోయిన్ ఎఫైర్స్ పై వచ్చే రూమర్స్ గురించి చాలా ఘాటుగా స్పందించింది.

ఈ చెండాలమైన పద్దతి 90s నుంచే స్టార్ట్ అయిందని, ఇది ఇంకా కొనసాగుతుంది అంటూ ఫైర్ అయింది. అయితే 90s లో సినిమాల ప్రమోషన్స్ కోసం నిర్మాతలే ఇలాంటి రూమర్స్ ను క్రియేట్ చేసేవాళ్లు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మొదట్లో ఎవరో చేస్తున్నారని అనుకునే వాళ్లమని, కానీ, అది నిర్మాతల పనే అని తెలిసిన తర్వాత షాక్ అయ్యామంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

- Advertisement -

అలాగే కెరీర్ ప్రారంభంలో తనను బాడీ షేమింగ్ చేశారంటూ ఓపెన్ అయింది. ఆ టైంలో హీరోయిన్లు బొద్దుగా ఉండే వాళ్లని, కానీ, తాను సన్నగా ఉండటంతో హేళన చేసేవాళ్లు అంటూ చెప్పుకొచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు