Sonia Aggarwal: రవి గాడి లవర్ దండుపాళ్యం బ్యాచ్ లో చేరిందా.?

Sonia Aggarwal: సోనియా అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోనియా ఎన్ని సినిమాలు చేసినా కూడా సెవెన్ జి బృందావన్ కాలనీ సినిమాతో మంచి గుర్తింపును సాధించింది. ఆ సినిమాలో ఈమె నటనకు మంచి మార్కులు పడ్డాయని చెప్పొచ్చు. అయితే 2003లో వచ్చిన కాదల్ కొండెన్ సినిమాతో కూడా మంచి గుర్తింపును సాధించుకుంది. ఆ తర్వాత సెల్వరాఘవన్ చేసిన ఎక్కువ సినిమాల్లో కనిపించింది సోనీయా .

Sonia Agarwal

మిగతా భాషల్లో గుర్తింపు

కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ, తమిళ్ , మలయాళం ఫిలిమ్ ఇండస్ట్రీ లో కూడా కొన్ని సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఈ మధ్యకాలంలో రామ్ పోతినేని నటించిన రెడ్ అనే సినిమాలో కనిపించింది. ఆ తర్వాత శాసనసభ అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా కనిపించింది. ప్రస్తుతం వనితా, సోనియా అగర్వాల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం దండుపాళ్యం. సోనియా ఈ సినిమాలో చేస్తుండటంతో రవి గాడి లవర్ దండుపాళ్యం బ్యాచ్ లో చేరిందా అని కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇతర పాత్రల్లో ముమైత్‌ ఖాన్‌, ఫిలిమ్స్‌ సుబ్రమణ్యం, బిర్లా బోస్‌, ఆలియా, నిషా రఫీక్‌ ఘోష్‌, రవి శంకర్‌ తదితరులు నటిస్తున్నారు. టైగర్‌ వెంకట్‌ స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహించారు.

- Advertisement -

సినిమా కథాంశం

1980 నుంచి నేటి వరకు దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో దోపిడీలు, హత్యలు వంటి ఘోరాలకు ఒక ముఠా పాల్పడుతుంది. వీరిలో ఒక బృందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటారు.ఈ ముఠాపై 390 చోరీలు, 108 హత్యలు, 90 అత్యాచారం లాంటి కేసులు ఉన్నాయి.ఒకే ముఠాకు ఆరు సార్లు మరణశిక్ష పడుతుంది.ఈ కేసులు ఇంకా కొనసాగుతున్నాయి.కానీ, ఇప్పటివరకు ఒక్కరికి కూడా మరణ శిక్ష అమలు చేయలేదు.అరెస్టయిన వారిని అన్ని కేసుల్లో నిర్దోషులుగా విడుదల చేస్తున్నారు. ఇపుడు కేవలం పది కేసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి.ఈ కేసులోని నిందితులంతా నిరక్ష్యరాస్యులైన దినసరి కూలీలు. ఇలాంటి యధార్ధ సంఘటనల ఆధారంగా తీసుకుని ఈ సినిమాను చేసినట్లు దర్శకుడు తెలిపారు. ఈ సినిమా జూన్ 7న ప్రేక్షకులు ముందుకు రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు