Sonusood: మరో నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన సోనూసూద్

Sonusood: సోను సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సాధించుకున్నాడు. ఎన్నో హిట్ అయిన సినిమాలలో సోనుసూద్ కీలక పాత్రలో కనిపించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ పూరి జగన్నాథ్ వంటి దర్శకులతో మంచి పరిచయం ఉంది సోనుకి. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి సినిమాలో పశుపతి పాత్రలో కనిపించి అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఒక సందర్భంలో సోనూసూద్ ను హీరోగా కూడా పరిచయం చేసే ప్రయత్నం చేశాడు పూరి జగన్నాథ్.

ఇకపోతే కరోనా టైంలో సోను సూద్ ఎంత సాయం చేశాడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో విలన్ గా కనిపించినా కూడా నిజజీవితంలో మాత్రం రియల్ హీరో అనిపించుకున్నాడు. అడిగిన ప్రతి ఒక్కరికి సాయం చేస్తూ తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకున్నాడు. చాలామంది సోనూసూద్ సాయాన్ని పొందుకున్నారు. కరోనా టైంలో ఎక్కడెక్కడో చిక్కిపోయిన వాళ్ళని సొంత బస్సులు వేయించి మరి వాళ్ళ ఊరికి చేరుకునేలా సహాయం చేశాడు.

Sonu Sood

- Advertisement -

ఇకపోతే రీసెంట్గా మరోసారి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు సోను సూదు.మరోసారి ఒక నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి గొప్ప మనసును చాటుకున్నారు. డెహ్రాడూన్ కు చెందిన ఓ పేద కుటుంబంలోని మూడేళ్ల బాలుడికి వైద్య సాయమందించారు. అత్యవసరంగా గుండెకు సర్జరీ చేయాల్సి రావడంతో సోనూ సూద్ ఆదుకున్నారు. ఆ బాలుడికి సర్జరీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయించారు. సోనూసూద్ ఫౌండేషన్ పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా.. సోనూ సూద్ ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉన్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు