Soundarya.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అలనాటి హీరోయిన్ సౌందర్య గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. సావిత్రి తర్వాత అంత గుర్తింపు తెచ్చుకున్న ఈమె అంత ఇమేజ్ అతి తక్కువ సమయంలోనే దక్కించుకుంది.. కానీ అనతి కాలంలోనే స్వర్గస్తురాలయి అందరిని ఆశ్చర్యపరిచింది. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన సౌందర్య కట్టుబొట్టుతో ఎంతోమంది ఆడియన్స్ హృదయాలను దోచుకుంది. ముఖ్యంగా చిరంజీవిని మొదలుకొని నాగార్జున , జగపతిబాబు, వెంకటేష్ వంటి ఎంతోమంది హీరోల సరసన నటించిన ఈమె మంచి పేరు దక్కించుకుంది . అంతేకాదు వెంకటేష్ తో ఎక్కువ సినిమాలు చేయడం వల్ల వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందని.. పెళ్లి కూడా చేసుకుంటారు అని కామెంట్లు వినిపించాయి. అయితే అవేవీ నిజం కాలేదు.
30 ఏళ్లు కూడా నిండకనే స్వర్గస్తురాలు..
ఇకపోతే కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన సౌందర్యను తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. అలాంటి ఈమె కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే 30 ఏళ్లు కూడా నిండకముందే స్వర్గస్తురాలు అయ్యింది సౌందర్య. అయితే సౌందర్య చావును వారి కుటుంబ సభ్యులు ముందే గ్రహించారట. ఇక అసలు విషయంలోకి వెళితే సౌందర్య తండ్రి ప్రముఖ జ్యోతిష్యులు. ఆయన జాతకాలు చెబుతారు.. అంతేకాదు ఆయన చెప్పినవన్నీ జరిగాయట కూడా.. అందులో భాగంగానే తన కూతురి జాతకం కూడా చూశారు ఆయన ఇక సౌందర్య అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ ను అనుభవిస్తుంది అని.. అయితే ఊహించని విధంగా మరణిస్తుంది అని కూడా ఆయన ముందే సౌందర్య జాతకం ద్వారా తెలుసుకున్నారట. కానీ ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఎవరికీ చెప్పలేదు.
చావును ముందే గ్రహించిన సౌందర్య.. అందుకే అలా..
అందుకే కూతుర్ని అల్లారి ముద్దుగా పెంచుకున్నారు సౌందర్య తండ్రి.. ఇకపోతే సహజంగా పోయేముందు ఆ లక్షణాలు కొంతమందికి ముందే కనిపిస్తాయట. అలా సౌందర్యకి కూడా ముందే కనిపించాయని సమాచారం.. ఈ క్రమంలోనే ఆమె ఎప్పుడు చూసినా చాలా దిగాలుగా ఏదో పోగొట్టుకున్న దానిలాగా కనిపించేదట . సెట్లో కూడా ఆమె చనిపోయే కొన్ని రోజుల ముందు ఎవరితో పెద్దగా మాట్లాడేది కాదట ఎప్పుడు చూసినా ఏదో ఆలోచిస్తూ ఉండేదట ఎవరైనా అడిగితే ఏం కాలేదు ఊరికే అలా ఉన్నాను అంటూ చెప్పేదట.ముఖ్యంగా హీరోలు, హీరోయిన్లు, స్నేహితులు ఎవరు ఏం చెప్పినా సరే పట్టించుకునేది కాదట.. అలా చావును ముందే గ్రహించి డైలమాలో పడిపోయింద. ఇక దీంతో రాజకీయాల్లోకి ప్రవేశించాలి అనుకున్న ఈమె బీజేపీ తరఫున ప్రచారం నిర్వహించాలనుకుంది. అందులో భాగంగానే హెలికాప్టర్ ప్రయాణంలో తన సోదరుడితో కలిసి ప్రయాణిస్తుండగా హెలికాప్టర్ ప్రమాదం జరిగి అక్కడికక్కడే మృతి చెందింది సౌందర్య.. మొత్తానికైతే తన చావును ముందే గ్రహించిన ఈ ముద్దుగుమ్మ చావు నుంచి తప్పించుకోలేకపోయింది.. ఏం చేస్తాం ఆమె జాతకంలోనే అలా ఉంది మరి. ఈ విషయం తెలిసి అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.. మొత్తానికైతే సౌందర్య మనమధ్య లేకపోయినా ఆమె నటించిన ఎన్నో చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి.. అంతేకాదు ఇప్పటికీ ఈమె ఫోటోలు సినిమాలలో ఉపయోగిస్తూ ఉండడం గమనార్హం.