Soundarya: సౌందర్యతోనే అలాంటి పనులు చేయించాలనుకున్న దర్శకుడు ?

అలనాటి అందాల తార సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సౌందర్య అంటే చాలు తెలుగు సినీ అభిమానులు మరో సావిత్రిలా భావించేవారు. సౌందర్య నటన, అందానికి కోట్లాది సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఆమె మన లోకాన్ని విడిచి వెళ్లిపోయినప్పటికీ ఆమె సినిమాలు వస్తే జనాలు ఎగబడి చూస్తారు. ఎలాంటి ఎక్స్పోజింగ్ పాత్రలు చేయకుండా నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉండేది. సౌందర్య కన్నడ నాట పుట్టిన తెలుగు అమ్మాయి. తన తండ్రి చొరవతో కన్నడలో “గంధర్వ” అనే కన్నడ చిత్రంతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సౌందర్య ప్రతి ఒక్క సినీ అభిమానిని తన వైపుకు తిప్పుకుంది.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన అద్భుతమైన నటన, అందంతో ఎన్నో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. తన కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన “రాజేంద్రుడు గజేంద్రుడు” సినిమాలో హీరోయిన్ గా సౌందర్య నటించింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. ఆ సినిమా సక్సెస్ అనంతరం సౌందర్య ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో చాలా చిత్రాల్లో వరుసగా మాయలోడు, నెంబర్ వన్, హలో బ్రదర్, పెదరాయుడు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

Actress Soundarya Death Anniversary

- Advertisement -

ఈ క్రమంలోనే తాను సినిమాల్లో నటించే సమయంలో ఓ స్టార్ డైరెక్టర్ సౌందర్యతో బికినీ వేయించాలి అని విపరీతంగా ప్రయత్నాలు చేశారట. అంతేకాదు బికినీ వేసుకోమని సౌందర్యం తెగ ఇబ్బంది పెట్టారట. పదేపదే ఆ డైరెక్టర్ సౌందర్యను ఇబ్బంది పెట్టడంతో సౌందర్య డైరెక్ట్ గా…. డైరెక్టర్ వద్దకు వెళ్లి అసలు విషయం చెప్పేసిందట. “ఒక కూతురు బికినీ వేస్తే చూడాలి అని ఏ తల్లి, తండ్రి అనుకోరు. అదే విధంగా నేను బికినీ వేసుకుంటే చూడాలి అని జనాలు ఎప్పటికీ కోరుకోరు. ఎందుకంటే నన్ను ఓ చెల్లిలా, తల్లిలా, బిడ్డల అందరూ నన్ను భావిస్తూ ఉంటారు” అంటూ చాలా ఘాటుగా సౌందర్య చెప్పిందట. అప్పట్లో ఆమె మాటలకు డైరెక్టర్స్ అందరూ షాక్ అయ్యారట ఏది ఏమైనప్పటికి సౌందర్య ఎలాంటి ఎక్స్పోజింగ్ పాత్రలు చేయకుండా చీరకట్టు, బొట్టులో నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు మాత్రమే చేసేది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు