Filmstars Donations For Vayanad Victims : వయనాడ్ బాధితుల కోసం ఫిల్మ్ స్టార్స్ విరాళాలు.. ఇప్పటివరకు ఎవరెవరంటే!

Filmstars Donations For Vayanad Victims : కేరళలోని వయనాడ్ ప్రాంతంలో కొన్ని రోజుల క్రితం కొండ చరియలు విరిగిపడి గ్రామం మొత్తం నేలమట్టం అయిన సంగతి తెలిసిందే. భారీ వర్షంతో కొండచరియలు విరిగిపడగా, పెద్ద స్థాయిలో బురద గ్రామంలోకి వచ్చి అక్కడి ప్రజలని ముంచేసింది. కొన్ని వందల మంది కొట్టుకుపోయారు. ఈ ప్రమాదంలో దాదాపు 300 మందికి పైగా ప్రజలు మృతి చెందారు. ఇప్పటికీ కొన్ని అక్కడక్కడా శవాలు తవ్వితీస్తున్నారు. ఇక కేంద్రం నుండి NDRF, ఇండియన్ ఆర్మీ, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేప్పట్టగా, ఈ ప్రకృతి విపత్తులో వేలమంది ప్రజలు నిరాశ్రయులుగా మారారు. ఇదిలా ఉండగా వాయనాడ్ బాధితులను ఆదుకోవడానికి సౌత్ ఇండియా సినీ నటులు ముందుకొచ్చారు. తమవంతుగా భారీగా విరాళాలు అందచేయడమే కాకుండా, బాధిత ప్రాంతానికి వచ్చి సహాయం చేస్తున్నారు.

South Filmstars Donations For Wayanad Victims

వాయనాడ్ బాధితులకు అండగా సినీప్రముఖులు…

ఇక కేరళ వాయనాడ్ వరద బాధితుల కోసం సినీ ప్రముఖులు తమ వంతుగా ముందుకొచ్చారు. పలువురు సెలెబ్రిటీలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రజలకు చేయూతనివ్వగా, కొందరు బాధిత ప్రాంతానికి వచ్చి సహాయం కూడా చేస్తున్నారు. ఇప్పటికే సూర్య, కార్తీ, మమ్మూటీ, ఫహద్ ఫాజిల్ వంటి వారు ముందుకు వచ్చి విరాళాలు అందచేయగా, తాజాగా మరికొంతమంది ప్రముఖులు విరాళాలు అందచేశారు.

- Advertisement -

ఇప్పటివరకు విరాళాలు ప్రకటించిన సినీ ప్రముఖుల లిస్ట్..

మోహన్ లాల్ – 3 కోట్లు

మమ్మూట్టి – 20 లక్షలు

దుల్కర్ సల్మాన్ – 20 లక్షలు

సూర్య – జ్యోతిక దంపతులు రూ.50 లక్షలు

కార్తీ – 50 లక్షలు

కమల్ హాసన్ – 25 లక్షలు

ఫహాద్ ఫాజిల్ – నజ్రియా – 25 లక్షలు

విక్రమ్ – 20 లక్షలు

రష్మిక మందన్న – 10 లక్షలు

నయనతార – విగ్నేష్ శివన్ – 20 లక్షలు

టువినో థామస్ – 20 లక్షలు

South Filmstars Donations For Wayanad Victims

మోహన్ లాల్ భారీ సాయం..

ఇక సూపర్ స్టార్ మోహన్ లాల్ కేరళ స్టార్స్ కోసం భారీ 3 కోట్ల భారీ విరాళం ప్రకటించగా, వాయనాడ్ బాధితుల కోసం స్వయంగా ఆయన సాయం చేయడానికి వచ్చారు. శనివారం ఆయన వాయనాడ్ లో టెరిటోరియల్‌ ఆర్మీ బేస్‌ క్యాంప్ కు చేరుకున్నారు. టెరిటోరియల్‌ ఆర్మీలో లెఫ్టినెంట్‌ కల్నల్‌గా ఉన్న మోహన్‌లాల్‌.. విపత్తు ప్రాంతమైన వాయనాడ్ ని సందర్శించి సైనికులతో సమావేశమయ్యారు. సైనికులతో పాటు సహాయక చర్యల్లో పాల్గొనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు