South Indian Movies : జూలైలో రిలీజ్ కాబోతున్న సౌత్ ఇండియన్ మూవీస్ లిస్ట్… సినిమాల జాతరే

South Indian Movies : 2024 ఫస్ట్ హాఫ్ చూస్తుండగానే చకచకా గడిచిపోయింది. అప్పుడే జూలై నెల వచ్చేసింది. ఇక కొత్త నెలతో పాటు కొత్త కొత్త సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా పలు సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ఇప్పటికే జూలై మొదటి వారం కొన్ని సినిమాలు అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. అయితే ఇదే నెలలో పాన్ ఇండియా మూవీ ఇండియన్ 2, రాయన్ వంటి పెద్ద సినిమాలు బాక్స్ ఆఫీసు పని పట్టడానికి రెడీ అవుతున్నాయి. ఇక ఆలస్యం చేయకుండా 2024 జూలైలో రిలీజ్ కానున్న సినిమాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

2024 జూలై లో రిలీజ్ కానున్న సౌత్ ఇండియన్ మూవీస్ లిస్ట్

  • భారతీయుడు 2 – పాన్ ఇండియా మూవీ – జూలై 12
  • మార్కో – మలయాళం – జూలై 13
  • పురుషోత్తముడు – రాజ్ తరుణ్ తెలుగు మూవీ – జూలై 14
  • ARM (అజయంతే రందం మోషణం) – టోవినో థామస్ మలయాళ మూవీ – జూలై 18
  • విద్యార్థి విద్యార్థినియరే – కన్నడ మూవీ – జూలై 19
  • డార్లింగ్ – ప్రియదర్శి తెలుగు మూవీ – జూలై 19
  • రాయన్ – ధనుష్ తమిళ మూవీ – జూలై 26
  • బడ్డీ – అల్లు శిరీష్ తెలుగు మూవీ – జూలై 26
  • బిసి-బిసి ఐస్ క్రీం – కన్నడ మూవీ – ఇది జూలై 5
  • మాఫియా – కన్నడ థ్రిల్లర్ – జూలై 26

Kamal Haasan’s Indian 2 to Dhanush's Raayan: List of South movies releasing in July 2024

మోస్ట్ అవైటింగ్ సినిమాలు మాత్రం ఇవే

లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 మూవీ 2024లోనే అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ఒకటి. ఈ చిత్రం 1995లో వచ్చిన ఇండియన్‌కి సీక్వెల్ గా రిలీజ్ కాబోతోంది. శంకర్ షణ్ముగం దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ ట్రైలర్ ఇప్పటికే సేనాపతి అభిమానులలో భారీ అంచనాలను పెంచింది. ఈ చిత్రంలో కమల్ హాసన్‌తో పాటు సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్‌జె సూర్య, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, గుల్షన్ గ్రోవర్, కాజల్ అగర్వాల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అల్లిరాజా నిర్మించారు. 2024 జూలై 12న తమిళం, హిందీ, తెలుగులో హిందుస్తానీ 2, భారతీయుడు 2 పేర్లతో సినిమాను విడుదల చేయనున్నారు.

- Advertisement -

ఇక మరో ఇంట్రెస్టింగ్ మూవీ ధనుష్ నటించిన రాయన్. కమల్ హాసన్ భారతీయుడు 2 తర్వాత తమిళ పరిశ్రమ నుండి అత్యంత ఎదురుచూస్తున్న సినిమాలలో ఇదొకటి. ధనుష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, అపర్ణా బాలమురళి, వరలక్ష్మి శరత్‌కుమార్ , ప్రకాష్ రాజ్, ఎస్‌జె సూర్య, దుషార విజయన్, సెల్వరాఘవన్, శరవణన్, నిత్యామీనన్‌ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు. లెజెండరీ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ ప్రాజెక్ట్ ను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. రాయన్ జూలై 26న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ రెండు సినిమాలతో పాటు తెలుగు ప్రేక్షలకులను అలరించడానికి చాలా కాలం తరువాత అల్లు శిరీష్ బడ్డీ మూవీతో థియేటర్లలోకి రాబోతున్నాడు. అలాగే తాజాగా వివాదంలో చిక్కుకున్న రాజ్ తరుణ్ పురుషోత్తముడు మూవీ కూడా ఇదే నెలలో థియేటర్లలోకి రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు